క్రీడా పోటీల్లో పాల్గొన్న కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీల్లో పాల్గొన్న కలెక్టర్‌

Mar 8 2026 7:59 AM | Updated on Mar 8 2026 7:59 AM

అన్నానగర్‌: మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ క్రీడా పోటీలలో నామక్కల్‌ కలెక్టర్‌ దుర్గామూర్తి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా, నామక్కల్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయంలోని ఆట స్థలంలో రెవెన్యూ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వంటి విభాగాలకు చెందిన మహిళా అధికారులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్‌ దుర్గామూర్తి ప్రారంభించారు. మహిళా అధికారులతో పాటు బెలూన్‌ పగలగొట్టడం, మ్యూజికల్‌ చైర్స్‌ వంటి పోటీలలో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటల్లో అధికారులు, ఉద్యోగులతో కలిసి ఆమె పరిగెత్తి ఆడిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఆఫీస్‌ అసిస్టెంట్ల నుండి డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ల వరకు 100 మందికి పైగా మహిళా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement