తిరుత్తణి: తిరుత్తణి పట్టణ శివారులోని కార్తికేయపురం వద్ద రాష్ట్ర రహదారి సమీపంలోని చెత్తకుప్పలకు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో మంటలు చెలరేగి రోడ్డుకు విస్తరించింది. రోడ్డుకు సమీపంలో వివాహాల్లో వధూవరులను ఊరేగిపుంగా తరలించే కారు వుంచడంతో మంటలు చుట్టుముట్టాయి. వెంటనే అగ్నిమాపక శాఖ కార్యాలయానికి అక్కడున్న వారు సమాచారం ఇచ్చారు. హటాహుటిన ఘటన ప్రాంతం చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారి సంపత్ తన బృందంతో మంటలను ఆర్పారు.


