మహిళా ఓటర్లకు ‘విజయ్‌’ వరాలు | - | Sakshi
Sakshi News home page

మహిళా ఓటర్లకు ‘విజయ్‌’ వరాలు

Mar 8 2026 7:59 AM | Updated on Mar 8 2026 7:59 AM

● ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు నెలకు అందజేస్తున్న రూ. 1000 సాయాన్ని విమర్శిస్తూ, టీవీకే ప్రభుత్వం ఏర్పడగానే కుటుంబ యజమానురాలైన 60 సంవత్సరాలలోపు ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 నేరుగా అందజేస్తామని ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మినహాయింపు కల్పించారు. ● అన్నపూర్ణి సూపర్‌ సిక్స్‌ పేరిట ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ● అన్నయ్యసారె పథకం పేరిట పేద మహిళల వివా హ కానుకగా ఒక పౌను (8 గ్రాముల) బంగారం ప ట్టు చీర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు. ● వెట్రి పయనం (విజయ యాత్ర) పేరిట ప్రస్తుతం కొన్ని బస్సులకే పరిమితమైన మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సులకు వర్తింపజేస్తామన్నారు. ● కామరాజర్‌ విద్యా నిధి పేరిట 1 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు బడి మానేయకుండా ఉండేందుకు, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ● మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ’రాణి వేలునాచ్చియార్‌ దళం’ పేరుతో 500 ప్రత్యేక బృందాలుతో నిఘా ఉంచుతామని ప్రకటించారు. ● మహిళలపై నేరాలను త్వరితగతిన విచారించేందుకు ’అంజలై అమ్మాళ్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను’ ఏర్పాటు చేస్తాం. ● బస్సుల్లో అత్యవసర బటన్లు, నగరం అంతటా సిసిటివీ కెమెరాల ఏర్పాటుతో ’జీరో డార్క్‌ స్పాట్స్‌’ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ● ఆర్థిక స్వావలంబన ఇతర పథకాలు అమలు కోసం సింగ పెన్‌గల్‌ పేరిట మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారికి 100 శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ● తాయ్‌ మామన్‌ (మేనమామ) పథకం పేరిట రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు బంగారు ఉంగరం , బేబీ వెల్‌కమ్‌ కిట్‌ పంపిణీ. ● స్కూళ్లు, కాలేజీలు, రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా శానిటరీ నాప్కిన్ల పంపిణీ. ● ‘మహిళలు, పిల్లలు, వృద్ధుల సంక్షేమమే తమ పార్టీ ప్రాథమిక లక్ష్యం అని పేర్కొంటూ, దీని కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి, అది తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండేలా చూస్తాను‘ అని విజయ్‌ ప్రకటించారు.

అధికారంలోకి వస్తే..అంటూ వాగ్దానాల వర్షం నెలకు రూ. 2,500 సాయం యువతులకు వివాహానికి 8 గ్రాములతో తాళి అన్ని బస్సుల్లో మహిళలకు ఫ్రీ

సాక్షి,చైన్నె : మహిళా దినోత్సవం వేళ మహిళా ఓటర్లను గురి పెట్టి టీవీకే అధినేత విజయ్‌ వరాలు కురిపించారు. టీవీకే అధికారంలోకి వస్తే 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారు తాళం, పట్టు చీర అందజేస్తామన్నారు. తమిళనాడులో ఎలాగైనా అధికారాన్ని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా తమిళగ వెట్రి కళగం అధినేత, సినీ నటుడు విజయ్‌ ఉరకలు తీస్తున్నారు. కార్యక్రమాలను విస్తృతం చేశారు.ఇ ందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైన్నెలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ రంగాలలో ఉత్తమ సేవలను అందించిన మహిళలను సత్కరించారు. ఈసందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమం కోసం అమలు చేయబోయే విప్లవాత్మక పథకాలను ప్రకటించారు.

ప్రధాన ఎన్నికల హామీలు ఇవే:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement