సాక్షి,చైన్నె: నగరంలోని విద్యా , క్రీడా రంగంలో తోడ్పాటును అందించే విధంగా చైన్నెలో కాసాగ్రాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర స్థాయి పిల్లల చెస్ టోర్నమెంట్–2026 మంగళవారంతో ముగిసింది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 70 పాఠశాలల నుండి సుమారు 350 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
హోరా హోరీగా సాగిన పోటీలు
8 నుండి 17 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌ను నాలుగు విభాగాలలో నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, 6 కఠినమైన రౌండ్లలో సాగిన ఈ పోటీల్లో ప్రతి రౌండ్ ఉత్కంఠను రేకెత్తించింది. యువ మేధావులు తమ ఏకాగ్రత , ఓర్పుతో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ చదరంగం బోర్డుపై ఎత్తులకు పైఎత్తులు వేశారు.
విజేతల వివరాలు
తీవ్రమైన పోటీ అనంతరం ప్రతి విభాగంలోనూ ప్రతిభ కనబరిచిన అగ్రశ్రేణి 15 మంది విజేతలకు ప్రతిష్టాత్మక ట్రోఫీలను అందజేశారు. ముఖ్యంగా ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు ట్రోఫీలతో పాటు ’చెస్ క్లాక్’ను బహుమతిగా అందించారు. ఇది వారి అసాధారణ క్రమశిక్షణ , ఛాంపియన్‌షిప్ సామర్థ్యానికి గుర్తింపు అని కాసాగ్రాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ సీఓఓ గి ద్వారకేశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అది పిల్లలలో వ్యూహాత్మక ఆలోచనను , సహనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనంగా పేర్కొన్నారు.


