తిరువళ్లూరులో.. రసవత్తర రాజకీయం | - | Sakshi
Sakshi News home page

తిరువళ్లూరులో.. రసవత్తర రాజకీయం

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

తిరువళ్లూరులో.. రసవత్తర రాజకీయం

తిరువళ్లూరులో.. రసవత్తర రాజకీయం

తిరువళ్లూరు: ఎన్నికల కోడ్‌ కూయకున్నా, కూటమి చర్చలు కొలిక్కి రాకపోయినా అన్నాడీఎంకే తరపున సీటు తనదేనంటూ గట్టి నమ్మకంతో ప్రచారం వాహనాన్ని సైతం సిద్ధం చేశారు మాజీ మంత్రి రమణ. అన్నాడీఎంకే అభ్యర్థి ఇక్కడ పోటీ వుండరని, తిరువళ్లూరు అసెంబ్లీ సీటు కూటమికి వెళ్లే అవకాశం వుందని ప్రచారం జరుగుతున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రచార వాహనాన్ని సిద్ధం చేయడం గమనార్హం. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కేంద్రమైన తిరువళ్లూరు నియోజకవర్గంలో వన్నీయర్‌లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌. అయినా నియోజకవర్గంలో మొదలియార్‌, నాయుడు కులాలకు చెందిన వారి ప్రాభల్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. జిల్లా కేంధ్రమైన తిరువళ్లూరు నియోజకవర్గం 1952లో ఏర్పాటైయ్యింది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా, డిఎంకే ఏడుసార్లు, అన్నాడిఎంకే ఐదుసార్లు, కాంగ్రేస్‌ మూడుసార్లు, తమిళమానిల కాంగ్రేస్‌, కిషాన్‌ మజ్దూర్‌పార్టీ చెరోకసారి విజయం సాదించింది. ఈ స్తానంలో ఎక్కువ సార్లు డీఎంకే విజయం సాధించినా అన్నాడిఎంకేకు బలమైన పట్టున్న నియోజకవర్గం తిరువళ్లూరు. నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరపున మాజీ మంత్రి రమణ, యూనియన్‌ కార్యదర్శి సూరకాపురం సుధాకర్‌, తిరుత్తణి హరి( తిరుత్తణి నియోజకవర్గాన్ని కూటమికి కేటాయిస్తే) తదితరులు సీటును ఆశిస్తున్నారు. గతంలో రమణకు తలనొప్పిగా మారిన కమాండో భాస్కరన్‌ విజయ్‌ పార్టీలోకి వెళ్లిపోవడంతో ఆయనకు మార్గం మరింత సులవైంది. అయితే వచ్చే ఎన్నికల్లో తిరువళ్లూరును కూటమికి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా అవేం పట్టించుకోని మాజీ మంత్రి రమణ తన పనులను చాపకింద నీరులా విస్తరిస్తూ పని చేసుకుంటున్నారు. సీటు రాదనే అనుమానం వద్దులే..సీటు మనకే కచ్చితంగా వస్తుందిలేబ్బా అంటూ కార్యకర్తలను పురమాయిస్తున్నారు. అందులో భాగంగానే తన ప్రచార వాహానాన్ని సైతం సిద్దం చేశారు. ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసి రెండుసార్లు ఓటమి చవిచూసిన రమణ, ఒకసారి గెలిచి దాదాపు నాలుగున్నరేళ్లుగా మంత్రిగా కూడా పని చేశారు. డీఎంకేలోని వర్గపోరు, ప్రభుత్వంపై వ్యతిరేకత తనకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుని సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఎన్నికల పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement