ఘనంగా సర్దార్‌ – 2026 సాంస్కృతిక ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సర్దార్‌ – 2026 సాంస్కృతిక ఉత్సవాలు

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

ఘనంగా సర్దార్‌ – 2026 సాంస్కృతిక ఉత్సవాలు

ఘనంగా సర్దార్‌ – 2026 సాంస్కృతిక ఉత్సవాలు

సాక్షి, చైన్నె : ఏఎంజైన్‌న్‌ కళాశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్‌–కళాశాలల సాంస్కృ తిక వేడుక శ్రీసర్దార్‌ 2026శ్రీ విద్యార్థుల ఆనందోత్సాహాల నడుమ ముగిసింది. ఇందులో 70కి పైగా కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఉత్సవాన్ని ప్రముఖ నటుడు సంపత్‌ రామ్‌, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌. పుష్పరాజ్‌, , మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు విజయ్‌ జైన్‌ ప్రారంభించారు. నటి మాళవిక మనోజ్‌, ప్రముఖ సోషల్‌ మీడియా సెలబ్రటీ టిటిఎఫ్‌ వాసన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నృత్యం, సంగీతం, లలిత కళల్లో 12 రకాల పోటీలు నిర్వహించారు. విజేతలకు రూ. 2,50,000 నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సినిమా రంగంలో సృజనాత్మక కృషికి గాను ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్‌. పార్థిబన్‌ ను సత్కరించారు. నేపథ్య గాయకులు సామ్‌ విశాల్‌, మాళవిక సుందర్‌ చేసిన లైవ్‌ కాన్సర్ట్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. విద్యార్థులలో వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించడానికి 100కు పైగా స్టాళ్లతో ఈ ఉత్సవాలలో ఏఎం జసిన్‌ బజార్‌ ఏర్పాటు చేశారు. ఇది యువ విద్యార్థులు తమ వినూత్న ఉత్పత్తులను , వ్యాపార ఆలోచనలను ప్రదర్శించడానికి గొప్ప వేదికగా నిలిచింది. కళాశాల కార్యదర్శి ఉధన్‌ కుమార్‌ చోర్డియా మాట్లాడుతూ, విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వం, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ ఉత్సవం ఉద్దేశమని తెలిపారు. ఈ వేడుక ముగింపు కార్యక్రమంలో ఆర్కాట్‌ యువరాజు దివాన్‌ నవాబ్జాదా మొహమ్మద్‌ ఆసిఫ్‌ అలీ, రోటరీ జిల్లా గవర్నర్‌ వినోద్‌ సరోగి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించడమేకాకుండా విజేతలకు బహుమతులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement