హత్యకేసులో ఆరుగురికి డబుల్‌ జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఆరుగురికి డబుల్‌ జీవిత ఖైదు

Feb 25 2026 9:34 AM | Updated on Feb 25 2026 9:34 AM

హత్యకేసులో ఆరుగురికి డబుల్‌ జీవిత ఖైదు

హత్యకేసులో ఆరుగురికి డబుల్‌ జీవిత ఖైదు

– హోసూరు కోర్టు సంచలన తీర్పు

అన్నానగర్‌: వ్యాపారవేత్తను కిడ్నాప్‌ చేసి హత్య చేసిన కేసులో ఆరుగురికి హోసూరు కోర్టు డబుల్‌ జీవిత ఖైదు విధించింది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా కెండిగనపల్లి సమీపంలోని కందగనపల్లికి చెందిన లక్ష్మీనారాయణన్‌ (37) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతను భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కూడా. గతంలో కందగనపల్లిలోని పంచాయతీ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. 23.10.2017న అనుమానాస్పద వ్యక్తులు అతన్ని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లారు. ఆ తరువాత అతను ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు లక్ష్మి నారాయణన తెన్‌కనికోట్టై – పంచప్పల్లి రోడ్డులో దారుణంగా హత్యకు గురై చనిపోయాడు. తెన్‌కనికోట్టై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో లక్ష్మీ నారాయణన్‌ తన భూమిని అమ్మడం ద్వారా వచ్చిన రూ.30 లక్షలను తెన్‌కనికోట్టై ప్రాంతానికి చెందిన మహేష్‌ కుమార్‌కు అప్పుగా ఇచ్చినట్లు తేలింది. అయితే ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని కోరగా.. మహేష్‌కుమార్‌, అతని సహచరులు లక్ష్మి నారాయణ్‌ను కారులో కిడ్నాప్‌ చేసి హత్య చేశారని తేలింది. దీని తరువాత పోలీసులు మహేష్‌కుమార్‌, మరసంద్రం రాజ్‌కుమార్‌, పది అలియాస్‌ వెంకటాచలపతి, కెంబన్‌ అలియాస్‌ సురేష్‌, అలెనత్తం హరీష్‌, మరసంద్రం సురేష్‌, కర్ణాటకకు చెందిన సూరి అనే ఏడుగురి అరెస్టు చేశారు. వీరిలో సురేష్‌ 2021 నవంబర్‌లో హత్యకు గురయ్యాడు. మిగిలిన ఆరుగురిపై కేసు హోసూరు అదనపు జిల్లా కోర్టులో విచారణ సాగింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సంతోష్‌ ఆరుగురు నిందితులకు రెట్టింపు జీవిత ఖైదు, ఒక్కొక్కక్కరికి రూ.20వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు.

రైతు ఆత్మాహుతి

– ప్రైవేట్‌ ఫైనానన్స్‌ సంస్థ ఉద్యోగులపై కేసు

తిరువొత్తియూరు: ఫైనాన్స్‌ సంస్థ నుంచి తీసుకున్న అప్పు చెల్లించాలని సిబ్బంది ఒత్తిడి చేయడంతో రైతు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. విల్లుపురం జిల్లా, తిరువైన్నెనల్లూర్‌ సమీపంలోని పైన్నె వలం గ్రామానికి చెందిన అబ్బాస్‌ (42) రైతు. ఇతను 5 సంవత్సరాల క్రితం ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో జే.సి.బి. యంత్రాన్ని కొనుగోలు చేయడానికి రుణం తీసుకున్నాడు. అయితే తీసుకున్న రుణాన్ని సరిగ్గా చెల్లించలేదు. దీంతో గత 13వ తేదీన ఫైనాన్స్‌ సంస్థ వసూలు మేనేజర్‌ సి.మెయ్యూర్‌ (32) సహా నలుగురు జేసీబీని సీజ్‌ చేసుకోవడానికి పైన్నెవలం గ్రామానికి నేరుగా వెళ్లారు. అప్పుడు అబ్బాస్‌కు, ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అబ్బాస్‌ హఠాత్తుగా ఇంటిలో వున్న పెట్రోల్‌ ను ఒంటి పై పోసుకుని నిప్పు పెట్టుకున్నారు. దీంతో మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదకర స్థితిలో అతన్ని ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. దీనిపై ఇరుపక్షాల ఫిర్యాదు మేరకు తిరువైన్నెనల్లూర్‌ పోలీసులు ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగులు సి.మెయ్యూర్‌ గ్రామానికి చెందిన మూర్తి, వండిపాళయం గ్రామానికి చెందిన దీపజ్యోతి (31), కల్పట్టు గ్రామానికి చెందిన త్యాగలీసన్‌ (26), జే.సి.బి. కొనుగోలు చేసిన రైతు అబ్బాస్‌ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి మూర్తిని అరెస్టు చేశారు. అబ్బాస్‌ మెరుగైన చికిత్స కోసం చైన్నె కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు.

పోలీసుల ఫిర్యాదుల

పరిష్కార శిబిరం

సాక్షి, చైన్నె: చైన్నె వేప్పేరి పోలీసు కమిషరేట్‌లో కమిషనర్‌ ఎ అరుణ్‌ అధ్యక్షతన మంగళవారం పోలీసుల ఫిర్యాదుల పరిష్కార శిబిరం జరిగింది. పోలీసుల విధులు సమర్థంగా సాగేందుకు, వారి వ్యక్తిగత, సేవా సంబంధిత సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో చైన్నె నగరంలోని నాలుగు జోన్లలో పనిచేస్తున్న మొత్తం 250 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వీరిలో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, 30 మంది అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ప్రత్యేక సిబ్బంది, 211 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రమోషన్‌, బదిలీ అభ్యర్థనలు, శిక్షల రద్దు, పోలీసు క్వార్టర్స్‌ కేటాయింపు, వేతన లోపాల సవరణ వంటి అంశాలపై వినతులు కమిషనర్‌కు అందజేశారు. ఈ వినతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ మహేశ్వరన్‌, డిప్యూటీ కమిషనర్లు ఎ.సుబ్బులక్ష్మి (అడ్మినిస్ట్రేషన్‌), హరికిరణ్‌ ప్రసాద్‌ (వెల్ఫేర్‌ – ఎస్టేట్‌), ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement