ప్రేమోన్మాదం! | - | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాదం!

Feb 25 2026 9:34 AM | Updated on Feb 25 2026 9:34 AM

ప్రేమ

ప్రేమోన్మాదం!

●పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలి హత్య ●ఆపై ఆమె అవ్వను కూడా కడతేర్చిన ప్రియుడు

సాక్షి, చైన్నె: ప్రేమోన్మాదానికి ఓ ప్రియురాలు బలైంది. అడ్డు వచ్చిన ఆమె అవ్వను సైతం ఆ ఉన్మాది కడ తేర్చాడు. పరారీలో ఉన్న అతడిి కోసం పొల్లాచ్చి పోలీసులు గాలిస్తున్నారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలో గౌండన్‌ పాళయంకు చెందిన భూపతి ద్విచక్ర వాహన మెకానిక్‌ షాపు నడుపుతున్నారు. ఆయనకు భార్య కలైయరసి. హరిత (18), కౌసి (16) అనే కుమార్తెలు ఉన్నారు. తన తల్లి మైలాత్తాళ్‌ (65)తో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కౌసి చదువు మానేసి ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తోంది. కప్పలంగరైకి చెందిన అభిషేక్‌ (20)తో ఇక్కడ కౌసికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న సమాచారంతో కుమార్తెను భూపతి మందలించాడు. అదే సమయంలో అభిషేక్‌ తన తల్లిదండ్రులతో కలిసి కౌసిని వివాహం చేయించాలని భూపతి కుటుంబాన్ని సంప్రదించి విన్నవించాడు. కౌసికి వివాహ వయస్సు రాలేదని, ఆమెకు ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదని పేర్కొంటూ వారిని భూపతి పంపించేశాడు.

ఉన్మాదిగా మారి..

తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు వస్తే అవమానించడమే కాకుండా, తనకు పెళ్లి వద్దంటూ కౌశి పేర్కొన్నట్టుగా సమాచారం అందుకున్న అభిషేక్‌ ఉన్మాదిగా మారాడు. సోమవారం రాత్రి కౌసి ఇంటికి వెళ్లి ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను కిరాతకంగా పొడిచాడు. ఆమె అరుపులు విన్న అవ్వ మైలాత్తాల్‌ పరుగున రాగా, ఆమైపె కూడా దాడిచేశాడు. ఇద్దర్ని విచక్షణా రహితంగా పొడిచాడు. దీనిని చూసిన హరితపై కూడా కత్తితో దాడి చేసి పరారీ అయ్యాడు. రక్తపు మడుగులోపడి ఉన్న హరితను ఇరుగు పొరుగు వారు పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో కౌశి, మైలాత్తాల్‌ మరణించగా, హరిత తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పరారీలో ఉన్న అభిషేక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రేమోన్మాదం! 1
1/1

ప్రేమోన్మాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement