ఆల్ న్యూ గ్రావైట్ గ్రాండ్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: చైన్నె నందనంలోని అటోరెల్లి నిస్సాన్‌లో సరికొత్త ఆల్ న్యూ గ్రావెట్ కారును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీరియల్ నటి ఫరీనా ఆజాద్, నటి రీమా, నటి శుభ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆటోలోన్ వైస్ ప్రెసిడెంట్ పిఎం సెంథిల్ నాథన్, నిస్సాన్ ఇండియా రీజనల్ సేల్స్ మేనేజర్ ఆనంద్ బాబు హాజరయ్యారు. ఆటోరెల్లి నిస్సాన్ సీఈవో నేహా చోప్రా సరికొత్త నిస్సాన్ గ్రావైట్ గురించి వివరించారు. ఈ గ్రావైట్ కారు అత్యాథునిక డిజైన్ , మెరుగైన భద్రతా వ్యవస్థలు, అత్యుత్తమ పనితీరు కూడికుని ఉందన్నారు.


