క్లుప్తంగా
ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌ను
చుట్టుముట్టిన నిరసనలు
కొరుక్కుపేట: హిందీ బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలిపేందుకు కొందరు సమావేశమయ్యారు. గాంధీ తిరుమురుగన్ నేతత్వంలో వారు కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు. తరువాత హిందీ లిపిని తుడిచి వేయడానికి చేయడానికి రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించడానికి యత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేశారు. అంతకుముందు గాంధీ తిరుమురుగన్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీ భాషను ప్రవేశపెట్టే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందన్నారు. స్టేషన్లలో హిందీని అధికంగా వినియోగిస్తున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌లో హిందీ రాసినట్లుగా వారు తమిళ భాషను రాస్తారా? తమిళనాడులో హిందీని రుద్దనివ్వమని ఈ హిందీ విషయంపై సీమాన్ ఎందుకు మౌనంగా ఉన్నారు. విజయ్‌కు తమిళ స్పృహ ఉందా? ఓట్ల కోసమే పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. డీఎంకే, కార్మికులు అనుబంధ పార్టీలు బయటకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.
నదిలో మునిగి అక్కాచెల్లెలి మృతి
అన్నానగర్: తామరభరణి నదిలో శనివారం స్నానం చేస్తుండగా నీటిలో మునిగి అక్క, చెల్లెలు మృతి చెందారు. తేని జిల్లాలోని బంగ్లామేడుకు చెందిన చంద్రకుమార్ కేరళలోని ఇడుక్కిలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఇతను తన కుటుంబం తమ పూర్వీకుల దేవతను పూజించడానికి తమిళనాడుకు వచ్చి తూత్తుకుడి జిల్లాలోని అరుణాచలస్వామి ఆలయానికి వెళ్లారు. శనివారం సాయంత్రం అక్కడ తామరభరణి నదిలో స్నానం చేస్తుండగా, చంద్రకుమార్ కుమార్తెలు అభినయ (16), మీనాక్షి (12) లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. వారిని రక్షించడానికి ప్రయత్నించిన చంద్రకుమార్ కూడా నీటిలో పడిపోయాడు. పక్కనే ఉన్న వారు చంద్రకుమార్, ఇద్దరు బాలికలను రక్షించారు. చంద్రకుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. అభినయ , మీనాక్షి విషాదకరంగా మరణించారు. ఈ ఘటనపై తూత్తుక్కుడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
పుళల్ జైలులో మరో ఖైదీ మృతి
అన్నానగర్: ఎన్నూర్‌కు చెందిన సెంథిల్ (47) 2014 లో హత్య కేసులో అరెస్టయి పుళల్ జైలులో ఉన్నాడు. అతనికి నాడీ వ్యవస్థ దెబ్బతిందని తెలుస్తోంది. జైలు బాత్రూంలో పడి తలకు తీవ్ర గాయమైన సెంథిల్, స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేరాడు. అయితే చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. పుళల్ ఇన్‌స్పెక్టర్ వసంత రాజా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మురికి కాలువలో పడి
కార్మికుడి మృతి
తిరువళ్లూరు: మద్యం మత్తులో మురికి కాలువలో పడ్డ కార్మికుడు మృతి చెందిన సంఘటన తిరువళ్లూరులో శనివారం ఉదయం జరిగింది. తిరువళ్లూరు పట్టణంలో ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయానికి సమీపంలోనే రెండు ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాల సైతం ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయం మద్యం మత్తులో ఓ కార్మికుడు డిప్యూటీ కార్యాలయానికి సమీపంలోని మురికి కాలువలో పడిపోయాడు. అయితే విషయాన్ని ఎవ్వరూ గుర్తించకపోవడంతో కాలువలోనే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కాలువలో వ్యక్తి పడి ఉన్నట్టు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కాలువలోని వ్యక్తిని బయటకు తీసి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు పుంగత్తూరు ప్రాంతానికి చెందిన బాబుగా గుర్తించారు. ఇతను తిరువళ్లూరు పట్టణంలోని సివిల్‌సప్‌లైయిస్ గోదాములో లోడర్‌గా పని చేస్తున్నట్టు నిర్ధారించిన పోలీసులు మృతుడి బంధువుల నుంచి ఫిర్యాదును స్వీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.
డ్రైనేజీలో పడి కార్మికుడి మృతి
తిరువొత్తియూరు: ఓపెన్ డ్రైనేజీ కాలువలో ప్రమాదవశాత్తు జారి పడిన కార్మికుడు మృతి చెందారు. తిరువళ్లూరు జిల్లా ఆరోగ్య కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక కాలువ మూత లేకుండా తెరిచి ఉంది. ఈ పరిస్థితిలో తిరువళ్లూరు సమీపంలోని వల్లువర్పురం ప్రాంతానికి చెందిన బాబు అనే కూలీ కార్మికుడు శనివారం ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు. దీనిపై సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతను మద్యం మత్తులో పడి పపోయాడా లేదా మరే ఏదైనా కారణం ఉందా అని పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసులో
ముగ్గురికి యావజ్జీవం
తిరువొత్తియూర్: చైన్నె చూళైమేడు ప్రాంతానికి చెందిన కోటీశ్వరన్ (42)కు 2013 జూన్ 1వ తేదీన అదే ప్రాంతంలోని ఓ ముఠాతో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ ముదరడంతో ఆగ్రహం చెందిన ముఠా సభ్యులు సిమెంట్ రాయిని తీసి కోటీశ్వరన్ తలపై వేసి అతనిని దారుణంగా హత్య చేశారు. దీనిపై చూళైమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో చైళైమేడుకు చెందిన రెహమాన్, షేక్ ఇబ్రహీం రాజ్, శిలంబరసన్, అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ పూర్తయి ముగ్గురి నిందితులకు యావజ్జీవ శిక్ష ఒక్కొక్కరికి రూ.25,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


