హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు
తిరువళ్లూరు: ఆస్తులు పంపకం చేయలేదన్న అక్కసుతో మామను తల్లితో కలిసి హత్య చేసిన వ్యవహారంలో కోడలు, ఆమె తల్లికి జీవితఖైదు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా నెమిలి గ్రామానికి చెందిన రైతు సభాపతి. ఇతడికి అదే ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. సభాపతి కోడలు గాయత్రి. సభాపతి తన కొడుక్కి ఆస్తులు పంపకం చేయలేదని తెలుస్తుంది. ఇదే విషయంపై గాయత్రికి, మామ సభాపతికి మద్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో గత 2019వ సంవత్సరంలో సభాపతి నిద్రిస్తున్న సమయంలో తలదిండును ఉపయోగించి శ్వాస అడకుండా గాయత్రి తలదిండుతో హత్య చేయడానికి ఉపయోగించారు. అయితే సభాపతి మృతి చెందకపోవడంతో తన తల్లి కలైవాణితో కలిసి సభాపతిపై కిరోసిస్ పోసి నిప్పు అంటించారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ సభాపతి మృతి చెందాడు. సంబంధిత సంఘటనపై మృతుడి కొడుకు, భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు జిల్లా అదనపు న్యాయస్థానంలో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో నేరం రుజువు కావడంతో జిల్లా అదనపు న్యాయమూర్తి తస్లీమా నిందితులు ఇద్దరికి జీవితఖైదు శిక్ష, ఐదు వేల చొప్పున జరిమానా విధించాలని తీర్పును వెలువరించారు. తీర్పు అనంతరం నిందితులు ఇద్దరినీ పుళల్‌జైలుకు తరలించారు.


