యువ శాస్త్రవేత్తలుగా పాఠశాల విద్యార్థులు
సాక్షి, చైన్నె : పాఠశాల విద్యలో చరిత్ర లో యంగ్ సైంటిస్ట్ ఆఫ్ తమిళనాడు–2025 ఉత్సవంలో విద్యార్థులు ప్రతిభ చాటారు. తమ ప్రతిభతో రూపకల్పన చేసిన వాటిలో 35కు పైగా పేటెంట్లు దక్కించుకుని అరుదైన ఘనతను సాధించారు. వివరాుల.. తిరుచ్చిలోని జేజే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ ఉత్సవం జరిగింది. ఇందులో గ్రాండ్ ఛాంపియన్లుగా ప్రాజెక్ట్– ఎకోస్కాన్ కియోస్క్ ఇన్నోవేటర్స్ ద్వారా విద్యార్థులు తనుష్క విజయ్ ,సంజన విజయ్ రూ. లక్ష బహుమతిని దక్కించుకున్నారు. సీనియర్ కేటగిరీ విజేతలుగా ప్రాజెక్ట్– ఫోటానెక్స్ ఇన్నోవేటర్స్ ద్వారా విద్యార్థులు పి. యశ్వంత్ , ఎస్. పూషిక రూ. 50 వేలు సొంతం చేసుకున్నారు. జూనియర్ కేటగిరీ విజేతలుగా ప్రాజెక్ట్ –ఆదిత్య ఇన్నోవేటర్స్ ద్వారా విద్యార్ధి ఏ ఆదిత్య రూ. 50 వేలు దక్కించుకున్నారు. ఈ ఉత్సవంలో 3.9 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చి తమలోని ప్రతిభను చాటుకున్నారు. ఇందులో 16 వేలకు పైగా ప్రాజెక్టులను సమర్పించారు. చివరకు 2,580మది ఫైనల్‌కు ఎంపికయ్యారు. విద్యార్థులు సాధించిన ఘనత, పాఠశాల తరగతిని వదిలి వాణిజ్య రంగానికి, పేటెంట్ హక్కులకు, స్టార్టప్‌ల ప్రారంభానికి ఈ మహోత్సవం దారి తీసింది. ఆవిష్కరణలు పెద్దలకే పరిమితం కాదు, తరగతి గదిలో ప్రారంభమయ్యే మనస్తత్వమే పిల్లల భవిష్యత్తును నిర్మిస్తాయని చాటే విధంగా ఈ ఉత్సవంలో ఉత్తమ ఆవిష్కరణల 35కు పైగా పేటెంట్లు పొందడం విశేషం.
యువ శాస్త్రవేత్తలుగా పాఠశాల విద్యార్థులు


