పళణి మరో 5 వాగ్దానాలు | - | Sakshi
Sakshi News home page

పళణి మరో 5 వాగ్దానాలు

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

పళణి

పళణి మరో 5 వాగ్దానాలు

అన్నాడీఎంకే 2వ విడత మ్యానిఫెస్టో విడుదల విద్యారుణాల మాఫీకి నిర్ణయం వృద్ధాప్య పింఛన్‌ రూ.2 వేలకు పెంచుతామని వెల్లడి

సాక్షి, చైన్నె : దివంగత నేత ఎంజీఆర్‌ జయంతి సందర్భంగా అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తొలి జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. ఇందులో ఐదు వాగ్ధానాలు చేశారు. ఇందులో కుల విలక్కు(ఇంటికి దీపం) పథకం పేరిట కుటుంబం కార్డుదారుకు నెలకు రూ. 2 వేలు నగదు పంపిణీ, సీ్త్రలకు ఇస్తున్నట్టుగానే పురుషులకు సైతం నగర రవాణా బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం, సొంతింటి కల సాకారం దిశగా అమ్మ గృహం పథకం, 100 రోజలుగా ఉన్న గ్రామీణ ఉపాధి పథకాన్ని 150 రోజులకు పెంచడం, 5 లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్ర వాహనం పథకం అమలు వంటి వాగ్దానాలు ఉన్నాయి. వీటిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితులలో బుధవారం మరో జాబితాను విడుదల చేశారు. చైన్నెలోని ఎంజీఆర్‌ మాలిగైలో జరిగిన మీడియా సమావేశంలో హామీల వివరాలను ప్రకటించారు.

విజయ్‌ విమర్శలను పట్టించుకోను..

ఈ ప్రకటన సమయంలో విజయ్‌ గురించిన ఓ ప్రశ్నకు పళణి స్వామి సమాధానం ఇస్తూ, ఆయన ఇంత వరకు ప్రత్యక్షంగా ప్రజలలోకి రాకుండా చేసే విమర్శలను పట్టించుకోదలచుకోలేదన్నారు. ఆయనకు ఏమీ తెలియదని, రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో కూడా తెలియని వ్యక్తికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అవినీతి శక్తి అన్నది ఆయన కల్పిత వ్యాఖ్యగా పేర్కొంటూ, తమను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. తమ దివంగత నేతలు జయలలితను, ఎంజీఆర్‌ను రోల్‌ మోడల్‌గా ఆయన తీసుకుని ఉన్నారని గుర్తు చేస్తూ, తన మీద కూడా అవినీతి ఆరోపణలు లేవని, తాను నిర్దోషిగా కోర్టు ద్వారా బయట పడ్డానని వివరిస్తూ, అలాంటప్పుడు అన్నాడీఎంకే ఎలా అవినీతి శక్తి అవుతుందో ఆయన్నే సమాధానం అడగండి అని వివరించారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని తాజాగా విజయ్‌ పక్కన పెట్టుకున్నారంటూ పరోక్షంగా సెంగొట్టయన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా ఈపీఎస్‌(పళణి స్వామి) అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమ కూటమి బలంగాఉందని ఇందులో డౌటే వద్దన్నారు.

జిల్లాల కార్యదర్శులతో భేటీ

ముందుగా పార్టీ జిల్లాల కార్యదర్శులతో పళణిస్వామి భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు గురించి సమీక్షించారు. ఎన్నికల వాగ్దానాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా పార్టీ నేతృత్వంలో చేపట్టి, చేపట్టనున్న వివిధ కార్యక్రమాల వివరాలను ఈసందర్భంగా పళణిస్వామి ఆరా తీశారు. అధికారమే లక్ష్యం, ప్రతి అభ్యర్థి గెలుపు ధ్యేయంగా ఇక పనుల వేగం పెరగాలని నేతలకు ఆదేశాలు ఇచ్చారు.ఈ సమావేశంలో పార్టీ నేతలు ఎస్పీ వేలుమని, దిండుగల్‌ శ్రీనివాసన్‌, కేపి మునుస్వామి, నత్తం విశ్వనాథన్‌, జయకుమార్‌, ఓఎస్‌మణియన్‌ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణలో అన్నాడీఎంకే శ్రేణులు పళణిస్వామి బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం పలికారు.

రెండో విడతలో కీలక హామీలు..

సామాజిక భద్రత పథకం కింద వృద్ధులకు నెల వా రీగా అందజేస్తున్న పెన్షన్‌ను తాము అధికారంలోకి వస్తే రూ. 1,200 నుంచి రూ. 2 వేలకు పెంచుతా మని వెల్లడించారు. అలాగే వితంతువులు, నిరాశ్ర య మహిళలు, దివ్యాంగులు, ట్రానన్స్‌జెండర్‌లకు కూడా ఈ పెంపు వర్తింపునకు నిర్ణయించారు. బ్యాంకుల నుంచి ఉన్నత చదువుల నిమిత్తం విద్యా ర్థులు తీసుకున్న విద్యా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. పేద కుటుంబాలకు చెంది న రేషన్‌ కార్డు దారులకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందచేస్తామన్న హామీ ఇచ్చారు. తమిళుల సాహస క్రీడ జల్లికట్టులో ఎద్దుల దాడిలో మరణించే వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు పరి హారం, గాయపడ్డ వారికి రూ.2 లక్షలు వైద్య ఖర్చు ల కోసం అందజేయనున్నారు. ప్రభుత్వ అనుమతి తో జరిగే జల్లికట్టు పోటీల నిర్వహణకు రూ.5 లక్ష ల ఆర్థిక సహాయం అందజేయనున్నారు. అలాగే, ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్‌ అనుమతి విధానాన్ని రద్దు చేసి పాత మాన్యువల్‌ విధానాన్ని మళ్లీ అమలు చే స్తామని వాగ్దానం చేశారు. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి కోసం వడ్డీ లేని రుణాలు అందజేయనున్నారు. దివ్యాంగుల స్వయం ఉపాధి రుణాలపై కూడా వడ్డీ మాఫీతో పాటూ రుణాల రద్దుకు ఎన్నికల మ్యానిఫెస్టోలో వివరాలను పొందుపరిచారు.

2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుతోంది. ఈ క్రమంలో బుధవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి రెండో విడత మ్యానిఫెస్టో జాబితాను విడుదల చేశారు. ఇందులో మరో ఐదు కీలక వాగ్దానాలను ప్రకటించారు.

పళణి మరో 5 వాగ్దానాలు1
1/2

పళణి మరో 5 వాగ్దానాలు

పళణి మరో 5 వాగ్దానాలు2
2/2

పళణి మరో 5 వాగ్దానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement