13న సేలంలో విజయ్‌ బహిరంగ సభ | - | Sakshi
Sakshi News home page

13న సేలంలో విజయ్‌ బహిరంగ సభ

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

13న స

13న సేలంలో విజయ్‌ బహిరంగ సభ

సాక్షి,చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నటుడు , టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ఈనెల 13న సేలంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో సేలం జిల్లా కమిటీ నిమగ్నమైంది. కరూర్‌ విషాద ఘటన తదుపరి సేలం నుంచి ప్రచారం మొదలెట్టేందుకు విజయ్‌ నిర్ణయించినా, అనుమతులు దక్కడంలో జాప్యం తప్పలేదు. చివరకు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఆతర్వాత ఈరోడ్‌లో ప్రచార సభలు నిర్వహించారు. అనంతరం విజయ్‌ చైన్నెలోని పార్టీ కార్యాలయం, మహాబలిపురంలోని రిసార్ట్‌ నుంచి తరచూ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూవ స్తున్నారు. ఈపరిస్థితులలో ఈనెల 13న సేలం బహిరంగ సభ ద్వారా ప్రజలలోకి వచ్చేందుకు నిర్ణయించారు. ఈ సభ ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల మధ్య నిర్వహించే విధంగా అనుమతులు కోరుతూ పోలీసులను విజయ్‌ పార్టీ వర్గాలు ఆశ్రయించారు. మకుటం చావాడి లో ఈసభ కోసం 25 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అదనంగా శీలానాయక్కన్‌ పట్టి వద్ద కూడా మరో వేదిక ఎంపిక చేశారు. సేలం పోలీసులు ఎలాంటి మెళిక పెద్దకుండా ముందు జాగ్రత్తలలో ఏర్పాట్లకు సన్నద్ధమయ్యారు. ఈ సభ విజయవంతం దిశగా సేలం జిల్లా కమిటీతో విజయ్‌ ఒకటి రెండురోజులలో చైన్నెలో సమావేశం కానున్నారు.

నారాయణన్‌, భాగ్యరాజ్‌లకు డాక్టరేట్‌ ప్రదానం

సాక్షి, చైన్నె: డాక్టర్‌ ఎంజీఆర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 34వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌, సినీ నటుడు భాగ్యరాజ్‌కు డాక్టరేట్‌ను బుధవారం ప్రదానం చేశారు. వివరాలు.. చైన్నెలోని మదురవాయిల్‌లోని డాక్టర్‌ ఎం.జి.ఆర్‌. ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ స్నాతకోత్సవ వేడుక బుధవారం సాయంత్రం జరిగింది. వేలప్పన్‌ చావడిలోని ఎ.సి.ఎస్‌. మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌లో ఉన్న ఎ.సి.ఎస్‌. కన్వెన్షన్‌ సెంటర్‌లో వర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఏసీ షణ్ముగం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ వైద్య కమిషన్‌ చైర్మన్‌ డా. అభిజత్‌ చంద్రకాంత్‌ షేత్‌ ముఖ్య అతిథిగా హాజరై తన స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. తరువాత ఆయన ర్యాంక్‌ హోల్డర్లకు పీహెచ్‌డీ డిగ్రీలు, పతకాలు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌కి గౌరవ డాక్టరేట్‌ డాక్టర్‌ ఆఫ్‌ సైనన్స్‌, లెజెండరీ ఫిల్మ్‌ స్క్రీన్‌ రైటర్‌, దర్శకులు, నటుడు కె. భాగ్యరాజ్‌ గౌరవ డాక్టరేట్‌ డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ (డి.లిట్‌)ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యక్షుడు ఎర్‌.ఎ.సి.ఎస్‌. అరుణ్‌కుమార్‌ , రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సి.బి. పళనివేలు మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవంలో పట్టభద్రులైన 3,743 మందికి డిగ్రీలు ప్రదానం చేసినట్లు వివరించారు.

3,500 ఏళ్లుగా

చిరుధాన్యాల వినియోగం

– అధ్యయంలో గుర్తింపు

కొరుక్కుపేట: రాష్ట్రంలోని తమిళులు 3500 ఏళ్లుగా చిరుధాన్యాలు వినియోగిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. కోయంబత్తూరులోని సిలుల్లా పశ్చిమ శ్రేణి పాదాల వద్ద, పూణేలోని డెక్కన్‌ కాలేజ్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి, పురావస్తు విభాగానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త ఎస్‌. సతీష్‌, పరిశోధనా విద్యార్థి ఆదిత్య పరిశోధనలు నిర్వహించారు. వారు కోయంబత్తూరు సమీపంలోని మోళప్పలయం అనే ప్రదేశం నుండి సేకరించిన నమూనాలను పరిశీలించారు. అందులో జొన్న, మొక్కజొన్న, గోధుమ జొన్న, ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌, హార్స్‌టైల్‌ వంటి మొక్కల అవశేషాలను పరిశోధకులు కనుగొన్నారు. వాటిలో కొన్నింటి గురించి క్రీ.శ. 3వ శతాబ్దం నుండి క్రీ.పూ. 2వ శతాబ్దం వరకు సంగం ఇతిహాసాల్లో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. కాలిన విత్తనాలను సేకరించి వాటి వర్గీకరణ లక్షణాలను పరిశీలించడం ద్వారా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ జాతిని గుర్తించారు. మట్టిలో కందులు, పచ్చి బఠానీలు, పప్పుధాన్యాలు వంటి విత్తనాల జాడలు కూడా కనిపించాయి. ఈ ప్రదేశంలో తమిళనాడు టిస్దువరం పప్పును తొలిసారిగా ఉపయోగించినట్లు పరిశోధకులు ఆధారాలను కనుగొన్నారు. ఈనేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు 3,500 సంవత్సరాల క్రితం నుండి జొన్నను ఉపయోగిస్తున్నారని నిర్ధారించారు.

13న సేలంలో విజయ్‌ బహిరంగ సభ 
1
1/1

13న సేలంలో విజయ్‌ బహిరంగ సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement