ఐఐటీ క్యాన్సర్‌ జీనోమ్‌ డేటాబేస్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ క్యాన్సర్‌ జీనోమ్‌ డేటాబేస్‌ విడుదల

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

ఐఐటీ క్యాన్సర్‌ జీనోమ్‌ డేటాబేస్‌ విడుదల

ఐఐటీ క్యాన్సర్‌ జీనోమ్‌ డేటాబేస్‌ విడుదల

సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాస్‌ భారతీయ లుకేమియా, కొలొరెక్టల్‌, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్ల జీనోమ్‌ డేటాబేస్‌ను విడుదల చేసింది. ఇది భారతీయ పరిశోధకులు, వైద్యులకు అందుబాటులో ఉంచారు. ఈ ప్రాజెక్ట్‌ను హ్యుందాయ్‌ హోప్‌ ఫర్‌ క్యాన్సర్‌ ద్వారా హ్యుందాయ్‌ ఇండియా మద్దతుతో నిర్వహించారు. ఐఐటీ మద్రాస్‌ ఈ డేటాబేస్‌ ద్వారా క్యాన్సర్‌ రోగుల జన్యు వివిధతలను గుర్తించి, వ్యక్తిగత చికిత్సలో సహాయ పడడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం, భారతదేశంలో 9 మందిలోఒకరికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని, 2.5 మిలియన్ల మంది ప్రస్తుతం క్యాన్సర్‌తో జీవిస్తున్నారని ఐఐటీ మద్రాసు బుధవారం ప్రకటించింది.ఈ డేటాబేస్‌ ముందస్తు గుర్తింపు, వ్యాధి ట్రాకింగ్‌, ఖచ్చితమైన చికిత్సలో మార్గనిర్దేశం చేస్తుందని ఐఐటీ డైరెక్టర్‌ వి కామ కోటి తెలిపారు. భారతీయ క్యాన్సర్ల జీనోమ్‌ డేటా సమకాలీన పరిశోధనకు కీలకం అని, బీసీజీఏ భారతీయ జనాభా–స్పెసిఫిక్‌ జీనోమ్‌లను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. క్యాన్సర్‌ జీనోమ్‌ పరిశోదనకు కొత్తమైలురాయిగా ఇది ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement