ప్రజల ఆలోచనల్ని ప్రతిబింబించేలా డీఎంకే మ్యానిఫెస్టో | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆలోచనల్ని ప్రతిబింబించేలా డీఎంకే మ్యానిఫెస్టో

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

ప్రజల ఆలోచనల్ని ప్రతిబింబించేలా డీఎంకే మ్యానిఫెస్టో

ప్రజల ఆలోచనల్ని ప్రతిబింబించేలా డీఎంకే మ్యానిఫెస్టో

– కనిమొళి

సాక్షి, చైన్నె: ప్రజల ఆలోచనల్ని ప్రతిబింబించే విధంగా డీఎంకే మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత కనిమొళి కరుణానిధి వ్యాఖ్యానించారు. కనిమొళి నేతృత్వంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ తన కసరత్తును వేగవంతం చేసిన విషయం తెలిసిందే. బుధవారం అన్నా అరివాలయంలో మ్యానిఫెస్టో కమిటీ ప్రజలు, పార్టీ వర్గాల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈ కిమటీ నిర్వహించింది. ఈ సందర్భంగా క నిమొళి మాట్లాడుతూ ప్రజల ఆలోచనలను బలోపేతం చేసే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను తయారు చేస్తామని తెలిపారు. తమిళనాడులో అందరి అభ్యున్నతి కోసం ఆది నుంచి డీఎంకే శ్రమిస్తున్నట్టు గుర్తు చేస్తూ, అన్ని వర్గాల ప్రతినిధుల విజ్ఞప్తులు, సూచనలు, సలహాలను స్వీకరిస్తున్నామన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ సూచనల మేరకు, శాసనసభ ఎన్నికలకు డిఎంకె ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేయడానికి, ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అందరిని కలుస్తూ వారి అభిప్రాయాలను వింటున్నామన్నారు. దీని ద్వారా డీఎంకె ఎన్నికల మేనిఫెస్టోను ప్రజా మేనిఫెస్టోగా రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కచ్చితంగా డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ఆలోచనలను ప్రతిబింబిస్తుందన్నారు. వారి అభిప్రాయాల ను తాము వింటున్నామని, ఇందులో భాగంగానే ఈ కమిటీని 3 భాగాలుగా విభజించి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement