క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

రైతుల సహకారంతో

మరో కొత్త రికార్డు

సాక్షి, చైన్నె: రైతుల సహకారం, మద్దతులో తాము మరో రికార్డును సొంతం చేసుకున్నామని ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామన్‌ మిట్టల్‌ తెలిపారు. 10 నెలల్లో 1.51 లక్షల ట్రాక్టర్ల అమ్మకాలు, భారతదేశపు నంబర్‌–1 ట్రాక్టర్‌ ఎగుమతి బ్రాండ్‌ సోనాలికా ట్రాక్టర్స్‌ సాధించిన మరో కీలక మైలురాయిని గురించి బుధవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. ఏప్రిల్‌ –2025 నుండి జనవరి –2026 వరకు కేవలం 10 నెలల్లోనే 1,51,604 ట్రాక్టర్ల అమ్మకాలు నమోదు చేసి అత్యంత వేగవంతమైన వృద్ధి, రికార్డును సృష్టించామన్నారు. భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న సాంకేతికతలతో కూడిన భారీ–డ్యూటీ ట్రాక్టర్ల ద్వారా సోనాలికా దేశవ్యాప్తంగా రైతులకు విశ్వసనీయతను చూరగొందన్నారు. రైతుకు ఉత్పాదకత అందిస్తూ వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధికి నాయకత్వం వహిస్తోందన్నారు. ‘జీత్నే కా దమ్‌’ అనే బ్రాండ్‌ ఉద్దేశ్యంతో అఖిల భారత స్థాయిలో తన బ్రాండ్‌ బలోపేత కార్యక్రమాలను సంస్థ మరింత వేగవంతం చేసిందన్నారు. ఈ అమ్మకాల మైలురాయిలో భాగంగా 2026లో జరుపుకోనున్న తమ 30వ వార్షికోత్సవానికి బలమైన ఆరంభం, రైతుల విశ్వాసమే మా విజయానికి పునాది అని వ్యాఖ్యలు చేశారు.

సేవా రంగంలో విస్తృత అవకాశాలు

సాక్షి,చైన్నె : సేవల రంగంలో పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నామని కోటక్‌ మహీంద్రా–ఏఎస్‌ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేష్‌ షా తెలిపారు. తమ కొత్త సర్వీసెస్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ప్రారంభం గురించి బుధవారం ఆయన వివరించారు. ఇది ఓపెన్‌–ఎండెడ్‌ ఈక్విటీ పథకంగా బుధవారం ప్రారంభించామని, ఫిబ్రవరి 18వ వరకు ఇంది అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ కొత్త ఫండ్‌ ప్రధాన వృద్ధి అన్నది సేవల రంగంలో పెట్టుబడి అవకాశాలను అందిస్తుందన్నారు. వినియోగదారుల సేవలు, టెలికాం, ఆరోగ్య, లాజిస్టిక్స్‌, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్‌, చమురు – గ్యాస్‌ వంటి విభిన్న రంగాల ద్వారా, భారతదేశ సేవల ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. సేవల ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్‌ స్వీకరణ , పట్టణీకరణ వృద్ధి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ఈ ఫండ్‌ మేనేజర్‌ రోహిత్‌ టాండన్‌ మాట్లాడుతూ, సేవల రంగం, వినియోగం, ఎగుమతి ఆధారిత విభాగాల ద్వారా స్థిరత్వం , వృద్ధిని కలిగిఉందని వివరించారు. స్థిరమైన, దీర్ఘకాలిక సంపద సృష్టికి, సామర్థ్యాన్ని, పెట్టుబడిని కేంద్రీకరిస్తుందన్నారు.

ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్‌ కమిషనర్‌

కొరుక్కుపేట: పోలీస్‌ కమిషనరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ ప్రజల నుంచి 30 ఫిర్యాదులను స్వీకరించి, సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సుబ్బలక్ష్మి (పరిపాలన) పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్లో

తమిళనాడుకు అన్యాయం..

– గుడ్డు సింబల్‌తో పోస్టర్ల కలకలం

కొరుక్కుపేట: ఈనెల 1వ తేదీ పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ –2026 ప్రవేశ పెట్టారు. అందులో తమిళనాడుకు ఆర్థిక కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో హిందీలో, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను విమర్శిస్తూ వివిధ ప్రదేశాలలో పోస్టర్లు అతికించారు. ఈ పోస్టర్లలో కోడి గుడ్డు చిత్రంతో ఉండడం కలకలం రేపింది. ’బీజేపీ కూటమి ప్రభుత్వ బడ్జెట్‌లో తమిళనాడు మోసానికి గురవుతూనే ఉంది’ అనే శీర్షికతో నైల్లె వెస్ట్‌ సిటీ డీఎంకే ఇన్‌చార్జ్‌ సుబ్రమణ్యం పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తేలింది.

మంటల్లో చిక్కుకుని

రిటైర్డ్‌ హెచ్‌ఎం మృతి

అన్నానగర్‌: విల్లుపురం జిల్లాలోని కుత్తంపూండి రోడ్డుకి చెందిన రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు ఏకాంబరం (79). లార్డ్‌ వల్లలార్‌ భక్తుడు అయిన ఇతను మంగళవారం రాత్రి తన ఇంట్లో దీపం వెలిగించి పూజలు చేస్తున్నాడు. ఆ సమయంలో కొన్ని బట్టలకు మంటలు అంటుకున్నాయి. నెమ్మదిగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పడానికి యత్నిస్తూ అతనూ మంటల్లో చిక్కుకున్నాడు. స్థానికులు, విక్రవాండి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి పరుగెత్తినప్పటికీ అప్పటికే ఏకంబరం మరణించాడు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

అడవి ఏనుగు దాడిలో

కార్మికుడు..

అన్నానగర్‌: కోయంబత్తూరు జిల్లాలోని కరమడై సమీపంలోని బిల్లూర్‌ ఆనకట్ట ప్రాంతంలో పారాలికాడ్‌ అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన శివకుమార్‌ (44) దినసరి కూలీ. బుధవా రం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో అడవి ఏనుగు అతని ఇంటి దగ్గర ఆగింది. శబ్దం విని, శివకుమార్‌ బయటకు వచ్చి అడవి ఏనుగును చూసి పరుగులు తీశాడు. అయితే అప్పటికే ఏనుగు అతడిపై దాడి చేసింది. దీంతో శశికుమార్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement