కమలంలో ప్రచార సారథులు
వానతీ శ్రీనివాసన్
మురుగన్
తమిళిసై సౌందరరాజన్
అన్నామలై
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే స్థానాలు వెలుగులోకి వచ్చినట్లైంది. ఇందుకుకారణం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ప్రచార సారథులను బీజేపీ అధిష్టానం రంగంలోకి దించడమే. ఇందులో బీజేపీ ప్రచార ప్రయాణం ఇన్‌న్ చార్జ్‌లుగా మాజీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ నియమితులయ్యారు. అన్నాడీఎంకే కూటమితో కలసి ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమైన విషయం తెలిసిందే. బీజేపీ ఈ సారి 50పైగా స్థానాలలో పోటీ చేయవచ్చు అనే సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఇందుకు బలాన్ని చేకూర్చే దిశగా శుక్రవారం పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పర్యవేక్షణలో ప్రచార పర్యటన ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో ప్రచార పర్యటనలు ఈ ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణలో జరగనుంది. అలాగే, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మ్యానిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు అన్నామలైకు సింగనల్లూరు, విరుగంబాక్కం, కారైకుడి, శ్రీవైకుంఠం, పద్మనాభపురం బాధ్యతలను, తమిళిసై సౌందరరాజన్‌కు గుమ్మిడిపూండి, మైలాపూర్, నాంగునేరి, పొల్లాచ్చి, కిల్లియూరు బాధ్యతలను, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్‌కు తిరుపరంకుండ్రం, రాధాపురం, వాల్పరై, తిరుప్పూర్ నార్త్, ఊటీ నియోజకవర్గాల బాధ్యతలను, వానతి శ్రీనివాసన్‌కు తిరుప్పూర్ సౌత్, కూనూర్, కోయంబత్తూర్ సౌత్‌లను అప్పగించారు. వీపీ దురైస్వామికి ఎగ్మూర్, రాశిపురం నియోజకవర్గాలు, సీనియర్ నేత హెచ్ రాజాకు, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌కు తెన్‌కాశి, పరమకుడి, మేట్టు పాళయం నియోజకవర్గాలను అప్పగించడం గమనార్హం. మిగిలిన నియోజకవర్గాలకు స్థానికంగా ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాలను బీజేపీ గురిపెట్టి, ప్రచార సారథులను రంగంలోకి దించడం గమనార్హం. అలాగే, ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనకు తమిళిసై సౌందరరాజన్ నేతృత్వంలో కమిటీని నియమించారు.
కమలంలో ప్రచార సారథులు
కమలంలో ప్రచార సారథులు
కమలంలో ప్రచార సారథులు


