ధనుష్‌కు జోడీ ఎవరు?
తమిళసినిమా: నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్న ఆయన 55వ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిజానికి ధనుష్ శ్రేయాస్ సంస్థతో కలసి ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్ర పూజాకార్యక్రమాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఇందులో ధనుష్‌తో పాటు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయిఅభయంకర్ పనిచేస్తున్నారు ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇకపోతే ధనుష్‌కు జంటగా నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. కాగా క్రేజీ ప్రాజెక్టులో కథానాయకి పాత్ర కోసం పూజజాహెగ్డే, లేదా సాయిపల్లవిని నటింప చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి సాయిపల్లవి ఇంతకుముందే ధనుష్‌కు జంటగా మారి–2 చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుందా లేదా పూజాహెగ్డే జత కడతారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడే అవకాశం ఉంది.
ధనుష్‌కు జోడీ ఎవరు?


