క్లుప్తంగా
అన్నానగర్: చైన్నెలో బాలుడు ఉరి వేసుకొని ఆత్మహత్మ హత్యకు పాల్పడ్డాడు. చైన్నెలోని ఐనావరంలోని పనంతోప్పు కాలనీకి చెందిన వెంకటరమణ, ప్రార్థన దంపతులు. వెంకటరమణ రైల్వేలో పనిచేస్తున్నారు. వీరిద్దరు పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వీరి కుమారుడు రమణ (17) తల్లితో నివసిస్తున్నాడు. ఈ స్థితిలో, ప్రార్థన బుధవారం ఉదయం ఎప్పటిలాగే నిద్రపోతున్న కుమారుడిని నిద్రలేపడానికి బెడ్ రూమ్ తలుపు తట్టింది. ఎంత తట్టినా తలుపు తీయకపోవడంతో దిగ్భ్రాంతి చెందిన ప్రార్థన ఇరుగు పొరుగు సాయంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. సమాచారం అందుకున్న ఓట్టేరి పోలీ సులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.బాలుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
సాక్షి, చైన్నె: నవజాత శిశు మరణాలను తగ్గించడంతో పాటూ చిన్నారులకు మెరుగైన ఆధునిక వైద్యం అందించేలా రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె క్యాపిటల్ ముందుకు వచ్చింది. రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె క్యాపిటల్ గ్లోబల్ గ్రాంట్ క్రింద రూ.45 లక్షల విలువైన బెడ్‌సైడ్ అల్ట్రాసౌండ్ అండ్ హై–ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ) యూనిట్‌ను విరాళం శ్రీ రామచంద్ర హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ ఐసీయూకు అందించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో రోటరీ ఫౌండేషన్, చైర్మన్ ట్రస్టీ హోల్గర్ నాక్, ఆర్‌సీసీసీ అధ్యక్షుడు అపూర్వ మోడీ, జిల్లా గవర్నర్ డి.దేవేంద్రన్ బెడ్‌సైడ్ అల్ట్రాసౌండ్, హై–ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ) యూనిట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ క్లబ్‌కు చెందిన శ్రీరామ్ దువ్వూరి, నీలకంఠన్ , భరత్ పాండ్య, రాజ్ కుమార్ నారంగ్, కిషోర్ రెడ్డి, బాబీ వరీందర్ సింగ్, ప్రశాంత్ గిరీష్ , ఆన్ రోష్ని మోడీ పాల్గొన్నారు.
వేలూరు: బస్సులో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడికి దేహశుద్ధి చేశారు. వేలూరు జిల్లా కాట్పాడి నుంచి కేవీ కుప్పంమీదుగా గుడియాత్తంకు ప్రభుత్వ బస్సు మంగళవారం సాయంత్రం బయలుదేరింది. బస్సులో ఓ యువతి ప్రయాణం చేస్తోంది. కేవీకుప్పం గ్రామం వద్ద వెళుతుండగా కళాశాలకు చెందిన విద్యార్థిని పక్కన యువకుడు పక్కన కూర్చున్నాడు. బస్సు బయలు దేరిన వెంటనే ఆ విద్యార్థినిపై యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి కేకలు వేయడంతో సహచర ప్రయాణికులు యువకుడికి దేహశుద్ధి చేసి గుడియాత్తం పోలీసులకు అప్పగించారు. వీటిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయనని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా విచారణ చేస్తున్నారు.
సాక్షి, చైన్నె: రక్త పరీక్షలు చేయకుండానే మధుమేహాన్ని గుర్తించే కొత్త సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు. కంటి వెనుక భాగంలోని రెటీనా ఫొటో ఆధారంగా, కృత్రిమ మేధస్సు(ఏఐ)సాయంతో మధుమేహాన్ని గుర్తించే విధానాన్ని మద్రాసు డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్, మంగళూరులోని యెనెపోయా వర్సిటీ, అమెరికాలోని ఎమోరీ వర్సిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధన అధ్యయనం ఈనెల 23వ తేదిన డయాబెటిస్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించబడిందని పరిశోధనలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య కౌప్ వివరించారు. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో మెడికల్ రెటీనా ఓక్యులర్ రీసెర్చ్ హెడ్ అయిన సీనియర్ డాక్టర్ ఆర్. రాజలక్ష్మి పాటుగా పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ అనంత్, డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ ఛైర్మన్ డాక్టర్ వి. మోహన్ వివరిస్తూ , దేశంలో 100 మిలియన్లకు పైగా డయాబెటిస్ రోగులు ఉన్నారని పేర్కొన్నారు. సాధారణ రెటీనా ఫొటోలతో కూడిన ఏఐ సాధనాలను ఉపయోగించడం వల్ల డయాబెటిస్‌ను ముందస్తుగా నిర్ధారించడంలో సహాయ పడేందుకు వీలుందన్నారు. ఈ పరిశోధన ఫలితాలను మరింతగా ధ్రువీకరించాల్సి ఉందన్నారు.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బియ్యం మిల్లు, వరి నిల్వ సౌకర్యంతో కూడిన కేంద్రాన్ని ఈరోడ్ పెరుంతురైలో చైన్నె రైస్ ఇండస్ట్రీ ఇండియా నెలకొల్పింది. చైనా, స్విట్జర్లాండ్ సాంకేతికతతో ఇక్కడ అన్ని ప్రక్రియలు ఆటో మేటెడ్‌గా సాగే విధంగా సౌకర్యం కల్పించారు. దీనిని చైన్నె రైస్ ఇండస్ట్రీ చైర్మన్ ఎంఎస్ తమిళ్ సెల్వన్, కేఆర్‌బీఎల్ చైర్మన్ అనిల్‌కుమార్, స్విట్జర్లాండ్‌కు చెందిన మేరీ ఓల్వాల్, చైనాకు చెందిన జార్జ్, కంపెనీ ఎండీ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు పురుష్తోమన్ ఈ మిల్లును బుధవారం ప్రారంభించారు. –సాక్షి, చైన్నె
క్లుప్తంగా


