రోగుల పట్ల ప్రేమతో నడుచుకోవాలి
వేలూరు: డాక్టర్‌లు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ప్రేమగా నడుచుకోవాలని వేలూరు నరువి ఆసుపత్రి చైర్మన్ జీవీ సంపత్ అన్నారు. వేలూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. ముందుగా నూతనంగా ఎన్నుకున్న సంఘం అధ్యక్షులు సతీష్‌కుమార్, కార్యదర్శి జగదీశన్, నిధి కార్యదర్శిగా ఎస్‌పీ వసంత్‌రాజ్‌తో పాటు సంఘం ప్రతినిధులు బాద్యతలు స్వీకరించారు. వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన సీఎంసీ ఆసుపత్రి వేలూరులో ఉన్నప్పటికీ అనేక మంది పలు ఆసుపత్రిలను ప్రారంభించి రోగులకు వైద్య సేవలను అందజేస్తున్నారన్నారు. ప్రస్తుతం నూతనంగా బాద్యతలు స్వీకరించిన డాక్టర్‌లు జిల్లాలోని వైద్యులకు మంచి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి సుభాషిణి, డాక్టర్లు పాల్గొన్నారు.


