క్లుప్తంగా
విజయ్ తీరును ఖండిస్తూ
అన్నాడీఎంకే పోస్టర్లు
తిరువొత్తియూరు: తిరుప్పువనం ప్రాంతంలో తవైక(టీవీకే) అధ్యక్షుడు నటుడు విజయ్ తీరును ఖండిస్తూ ఏఐఏడీఎంకే నాయకులు పోస్టర్లతో నిరసన వ్యక్తం చేశారు. మామల్లాపురంలో ఆదివారం టీవీకే పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో ఆ పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ మాట్లాడుతూ ఏఐడీఎంకే అవినీతి పార్టీ, బీజేపీకి బానిసగా ఏఐడీఎంకే అని విమర్శించారు. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. శివగంగైజిల్లా తిరుపప్పవనం ప్రాంతంలో విజయ్ ప్రసంగాన్ని ఖండిస్తూ ఏఐఏడీఎంకే తరపున నిరసన పోస్టర్లు అతికించడం సంచలనంగా మారింది.
480 సాంప్రదాయ వరి
రకాలతో మేనమామ సారె
తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో చెల్లెలి కూమార్తె పసుపు నీరాట్టు (పుష్పవతి) వేడుకలో ఓ మేనమాన 480 సాంప్రదాయ వరి రకాలను సారెగా ఇచ్చారు. సాధారణంగా శుఖకార్యాల్లో పండ్లు, స్వీట్లు, అలంకరణ వస్తువులు వంటివి కట్నంలో ఉంటాయి. కానీ పూర్వకాలంలో వ్యవసాయం ద్వారా లభించే వరి, ధాన్యం, కూరగాయలు వంటి వాటిని మేనమామ కట్నంగా ఇచ్చేవారు. దీనిని గుర్తుచేసుకునే కార్యక్రమం పుదుచ్చేరిలో జరిగిన పసుపు నీరాట్టు వేడుక జరిగింది. విల్లియనూరులో జరిగిన పసుపు నీరాట్టు వేడుకలో కొత్తగా వరి రకాల, వరసగా కానుకల పళ్లెంలో ఉంచారు. 480 సాంప్రదాయ వరి రకాలను సేకరించి వాటి పేర్లతో ప్యాకెట్లు పెట్టి మేనమామ కట్నంగా అందించారు. ఈ సమాచారం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కార్మికుల కోసం
డయాగ్నస్టిక్ సెంటర్
సాక్షి,చైన్నె : చైన్నెలోని రోజు వారీ వేతన జీవులు, నిర్మాణ కార్మికులు, తక్కువ ఆదాయంతో సాగే కుటుంబాలకు సహకారంగా కాసా గ్రాండ్ ఫౌండేషన్ నేతృత్వంలో డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. చైన్నె బీసెంట్ నగర్‌లోని కాసా గ్రాండ్ ఫౌండేషన్‌లో ఈ డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంగళవారం ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎంఎన్ అరుణ్ ప్రారంభించారు. ఇక్కడ డిజిటల్ ఎక్స్ రేలు, ఈసీజీ, సీటీ స్కాన్, థైరాయిడ్, డయాబెటిస్ ప్రొఫైల్స్, ట్రో పోనిన్ పరీక్షలు, రక్త పరీక్షలు వంటి అన్ని రకా ల మాస్టర్ హెల్త్ చెకప్‌లు అందించనున్నామని అరుణ్ వివరించారు. మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీలతో సేవలు అందిస్తు న్నామన్నారు. అత్యంత తక్కువ ఖరీదుతో పేద, మధ్యతరగతి వర్గాలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 నుంచి రాత్రి ఏడు గంటల వరకు , ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఇక్కడ సేవలు పొంద వచ్చని సూచించారు.
రూ. కోటి విలువైన
ప్రభుత్వ స్థలం స్వాధీనం
తిరుత్తణి: తిరుత్తణిలో కాలువ ఆక్రమించి నిర్మించిన ఇళ్లు ఆలయం కూల్చివేశారు. ఈ సందర్భంగా ఉద్రికత్త చోటు చేసుకోవడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరుత్తణి సాయిబాబా నగర్‌కు సమీపంలో ప్రజా పనుల శాఖకు చెందిన చెరువు వుంది. ఆ చెరువకు వర్షపు నీరు వెళ్లేందుకు వీలుగా గతంలో 40 అడుగుల వెడల్పు గల కాలువ వుండేది. అయితే పట్టణ విస్తరణతో 30 ఏళ్ల కిందట ప్రైయివేటు భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మించుకుని నివాముంటున్నారు. ఈక్రమంలో తిరుత్తణికి చెందిన వ్యక్తి చెరువకు వర్షపు నీరు వెళ్లు కాలువ ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నట్లు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించిన కట్టడాలు కూల్చి వేయాలని ఆదేశించింది. దీంతో డిసెంబర్ 7న రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టారు. అయితే వినాయక ఆలయం, అంగన్‌వాడీ కేంద్రంతో పాటూ ఐదు ఇళ్లు కూల్చివేతకు వ్యతికేంగా ల్యాండ్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇళ్లు ఆలయం కూల్చివేతను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బాధితుల వినతిని ల్యాండ్ కమిషన్ తిరస్కరించడంతో మంగళవారం ఆక్రమణ కట్టడాలు కూల్చివేసే పనులు రెవెన్యూ అధికారులు ముమ్మరం చేశారు. పోలీసుల సమక్షంలో ప్రజా పనుల శాఖ అధికారులు సంయుక్త సహాకారంతో 5 ఇళ్లు పూర్తిగా కూల్చివేయగా, ఓ ఆలయంతో పాటూ అంగన్‌వాడీ కేంద్రం సైతం తొలగించారు. కాగా స్వాధీనం చేసుకున్న స్థలం మార్కెట్ విలువ రూ. కోటి ఉంటుందని రెవిన్యూ అధికారులు తెలిపారు.
క్లుప్తంగా
క్లుప్తంగా


