అమ్మ సౌందర్య రహస్యం అదే..!
తమిళసినిమా: నటి శ్రీదేవిది సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బాల తారగానే తమిళం, తెలుగు తదితర భాషలలో తారాస్థాయికి చేరుకున్న నటి శ్రీదేవి. తమిళంలో 1967లో కందన్ కరుణై అనే చిత్రం ద్వారా బాలనటిగా తెరంగేట్రం చేసిన నటి శ్రీదేవి. భాషల్లో భాలతారగా నటించి ప్రాచుర్యం పొందిన ఆ తర్వాత కథానాయకిగా పరిచయమై తమిళం, తెలుగు ,కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటించి లేడీ సూపర్ స్టార్‌గా రాణించారు. అభిమానుల గుండెల్లో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి చిత్రాల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న తరుణంలోనే బాలీవుడ్ సినీ నిర్మాత బోనీకపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా శ్రీదేవి 54 ఏళ్ల వయసులో 2018లోనే శ్రీదేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లు ఇప్పుడు ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె హిందీ చిత్రాలతో పాటూ తెలుగులో రామ్ చరణ్ కు జంటగా పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఓ భేటీలో తన తల్లి సౌందర్య రహస్యం గురించి వివరిస్తూ.. తమ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్‌లో పండ్లు కచ్చితంగా ఉంటాయన్నారు. అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలిన పండ్లను రసంగా మార్చి తన తల్లి ముఖానికి రాసుకుంటారన్నారు. కొంతసేపు తర్వాత కడుక్కుంటే ముఖం తళతళ మెరిసిపోతుందన్నారు. పండ్ల రసం ముఖంలోని సెల్స్‌కు నూతన శక్తిని ఇస్తాయని, చచ్చిపోయిన సెల్సును తొలగించడానికి దోహదపడతాయని చెప్పారు. ఇదే తన తల్లి సౌందర్య రహస్యం అని తాను ఈ విధానాన్నే అమలు చేస్తున్నట్లు జాన్వీకపూర్ పేర్కొన్నారు.
అమ్మ సౌందర్య రహస్యం అదే..!


