మాటలకు మించి శక్తివంతంగా.. | - | Sakshi
Sakshi News home page

మాటలకు మించి శక్తివంతంగా..

Jan 28 2026 7:04 AM | Updated on Jan 28 2026 7:04 AM

మాటలకు మించి శక్తివంతంగా..

మాటలకు మించి శక్తివంతంగా..

తమిళసినిమా: సినిమా పుట్టిందే మూకీతో ఆ తర్వాత ఎన్నో విధాలుగా రూపాంతరం చెంది ఇప్పుడు డిజిటల్‌ స్థాయికి ఎదిగింది. అలా సినిమా శతాబ్ది వేడుకలను జరుపుకున్న తరుణంలో తాజాగా సినిమా మళ్లీ మూకీ చిత్రం రూపొందడం విశేషమే అవుతుంది. అవును అలాంటి మాటల్లేని చిత్రమే గాంధీ టాకీస్‌ ఇలాంటి చిత్రాన్ని ఇప్పుడు నిర్మించడం నిజంగా సాహసమే అని చెప్పాలి. ఆ సాహసాన్ని జి స్టూడియోస్‌, క్యూరీస్‌ డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పింక్‌ రూమ్‌ మేట స్టూడియోస్‌, మూవీ మిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు చేస్తున్నాయి. పంచ్‌ డైలాగులు , రణగణ శబ్దాలు ,భారీ తనం వంటి అంశాలతో చిత్రాలు రూపొందుతున్న ఈ రోజుల్లో అవేవీ లేకుండా, మాటలు కూడా లేకుండా శక్తివంతమైన కథనాలు, భావోద్వేగాలను మాత్రమే నమ్మి రూపొందిస్తున్న చిత్రం గాంధీ టాకీస్‌ విజయ్‌ సేతుపతి, అరవిందస్వామి, నటి అతిథి రావు హైదరి, సిద్ధార్థ్‌ జాదవ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ పాండురంగ్‌ బలేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో నటించిన అనుభవాన్ని నటుడు విజయ్‌ సేతుపతి పేర్కొంటూ మాటలు లేకుండా భావాలను వ్యక్తం చేయాలన్న సవాల్‌ను గాంధీ టాకీస్‌ తనకు ఇచ్చిందని అన్నారు. మౌనాన్నే శక్తవంతమైన భావాలుగా మార్చే అరుదైన చిత్రం ఇదన్నారు. గాంధీ టాకీస్‌ చిత్రాన్ని ఈనెల 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement