మన పద్మాలు
– ఇద్దరికి పద్మ భూషణ్ – 10 మందికి పద్మశ్రీ
సాక్షి, చైన్నె : రాష్ట్రానికి ఈసారి పద్మశ్రీ అవార్డులు ఏకంగా పది మందికి దక్కాయి. మరో ఇద్దరికి పద్మ భూషన్ వరించింది. వివరాలు.. ఏటా గణతంత్ర వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన, అందిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఏటా రాష్ట్రానికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల్లో ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా అవార్డుల జాబితాలో తమిళనాడు సినిఈ రంగానికి ప్రాధాన్యత దక్కుతూ వస్తున్నది. కానీ కోలీవుడ్‌కి చెందిన వారెవ్వరికీ ఈసారి పద్మా అవార్డులలో చోటు దక్కకపోవడం గమనార్హం.
పద్మ భూషణ్‌కు ఎంపికై న వారు..
ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, వైద్య విద్యావేత్త పద్మశ్రీ డాక్టర్ కల్లి పట్టి రామస్వామి పళణి స్వామి( కేఆర్ రామస్వామి)ని పద్మ భూషన్ వరించింది. వైద్యరంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మెడిసిన్ విభాగంలో పద్మ భూషన్ కేటాయించారు. అలాగే పారిశ్రామికవేత్తగా, దాతగా, సామాజిక కార్యకర్తగా ముందుకు సాగుతున్న ఈరోడ్‌కు చెందిన ఎస్‌కేఎం గ్రూప్ అధినేత పద్మశ్రీ ఎస్‌కేఎం మైలానందన్‌కు సైతం పద్మ భూషన్‌ను ప్రకటించారు. సామాజిక సేవ విభాగంలో ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
పద్మశ్రీ దక్కించుకున్నవారు..
పద్మశ్రీ అవార్డులు ఈసారి ఏకంగా 10 మందికి అందజేశారు. ఆర్ట్ విభాగంలో గాయత్రి బాలసుబ్రమణియన్ – రజనీ బాల సుబ్రమణియన్ మెడిసన్‌లో హెచ్ వి హెన్డే, సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో కె.రామస్వామి, సివిల్ సర్వీస్‌లో కె.విజయకుమార్, ఆర్ట్ విభాగంలో ఓదువార్ తిరుత్తణి స్వామినాథన్ మెడిసన్‌లో డాక్టర్ పుణ్యమూర్తి నటేషన్, ఆర్ట్‌లో ఆర్.కృష్ణన్, ఆర్ట్‌లో రాజస్థపతి కల్లియప్ప గౌండర్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ శివశంకరి ,ఆర్ట్ కేటగిరిలో తిరువారూర్ భక్తవత్సలం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీలినాథన్ కామకోటిని పద్మశ్రీ వరించాయి. వీరిలో వీలినాథన్ కామ కోటి(వీ కామకోటి) ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ మద్రాసు ప్రగతిలో కామ కోటి కీలక పాత్ర పోషిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థ జాబితాలోఐఐటీని మొదటి స్థానంలో నిలబెట్టడంలో ఆయన కృషికి తాజాగా పద్మ శ్రీ దక్కడం విశేషం. తమిళ్ కడవుల్ మురుగన్‌కు ప్రసిద్ది చెందిన ఆరు పడై వీడులలో ఒకటి గా ఉన్న తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో 26 సంవత్సరాల పాటూ ఓదువార్‌గా ప్రత్యేక పూజా సమయాలలో ఆధ్యాత్మిక భక్తి పాటలను ఆలపించిన తిరుత్తణి స్వామినాథన్‌కు పద్మశ్రీ దక్కింది. వీఆర్‌ఎస్ తీసుకున్న తదుపరి ఆయన తాజాగా మైలాడుతురైలోని ధర్మపురం ఆధీనం మఠంలో యువతకు ఆధ్యాత్మిక భక్తి గీతాల శిక్షణలో నిమగ్నమై ఉన్నారు.
మన పద్మాలు
మన పద్మాలు


