35 స్థానాలు కమ్మ వారికి కేటాయించాలి
తిరువళ్లూరు: రాష్ట్రంలో బలంగా వున్న 35 స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీలు కమ్మ కులానికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కమ్మ గ్లోబర్ ఫెడరేషన్ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ డిమాండ్ చేశారు కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేసే విధంగా పిబ్రవరి 8న తిరువళ్లూరు జిల్లా వేపంబట్టులో భారీ బహిరంగ సభ, మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాంగానే సభ జరగనున్న ప్రాంతాన్ని నిర్వాహకులతో కలసి పరిశీలించారు. అనంతరం జెట్టి కుసుమకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా కమ్మవారు వున్నారని, 35 స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు నిర్ణయాత్మక శక్తిగా వున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా వున్న స్తానాల్లో టికెట్‌లను కేటాయించాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకుంటే తాము రాజకీయ పార్టీనీ సైతం ప్రారంబిస్తామని ప్రకటించారు. మహానాడుకు పెద్ద ఎత్తున కమ్మసామాజికవర్గం నేతలు హాజరై తమ బలాన్నీ ఐక్యతను చాటి చెప్పాలని సూచించారు. సంఘం నిర్వాహకులు బజరంగ్ కళాశాల చైర్మన్ భాస్కరన్, శ్రీలక్ష్మీ హయగ్రీవ పరిశోధన, ఎడ్యుకేషనల్ ట్రస్టీ జయచంద్రన్, సభ్యులు సుబ్రమణ్యం, వీఎస్ రామన్, ధనపాల్, రామమూర్తి, గోవర్దన్‌నాయుడు పాల్గొన్నారు.


