సమస్యలు పరిష్కరించాలని వినతి
వేలూరు: స్వాతంత్య్ర పోరాట వారసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర పోరాట వారసులతో సమావేశం జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశంలో వారసులకు సంబంధించి 16 వినతులను అందజేశారని వాటిలో పది సమస్యలను పరిష్కరించడంతోపాటు ఆరు వినతులను తొలగించామన్నారు. వారసులు మాట్లాడుతూ వారసులందరికీ ఉచిత బస్సు పాసులతో పాటు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, వారసులు పరిశ్రమలు స్థాపించేందుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. రిపబ్లిక్‌డే దినోత్సవంలో వారసులకు ప్రత్యేక రుణాలు మంజూరు చేయడంతోపాటు వివిధ సంక్షేమ పథకాలు పంపిణీ చేయాలన్నారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ వీటిపై ప్రభుత్వానికి సిఫారస్సు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ సీఈఓ ప్రేమలత, ప్రత్యేక తహసీల్దార్ తిరుమారన్, శిశు సంక్షేమ శాఖ ప్రాజెె క్టు అధికారి శాంతి ప్రియదర్శిని, వారసులు పీపీ చంద్రప్రకాష్, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్ర పోరాట వారసులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


