ఫిబ్రవరిలో తెరపైకి ఫోర్త్ ఫ్లోర్
తమిళసినిమా: ఆరి అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఫోర్త్ ఫ్లోర్. నటి దీప్సిక నాయకిగా నటించిన ఇందులో నటి పవిత్ర , దర్శకుడు సుబ్రహ్మణ్యశివ, తలైవాసల్ విజయ్ ,ఆదిత్య కదిర్ ముఖ్యపాత్రలు పోషించారు. మనో క్రియేషన్ పతాకంపై ఏ.రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఎల్‌ఆర్ సుందరపాండే దర్శకత్వం వహించారు. చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కలలకు ,జీవితానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. చైన్నె నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ ఒక ఇంట్లో జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనల ఇతివృత్తంగా ఉంటుందని చెప్పారు. చిత్ర కథ ఊహించని విధంగా, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. చిత్ర టైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా సెవెన్త్ స్టూడియో సంస్థ ద్వారా కె.కన్నన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి ధరణ్ సంగీతాన్ని, జే లక్ష్మణ్ చాయాగ్రహణం అందించారు.
ఆడియో
ఆవిష్కరణలో
నకుల్,
చిత్ర యూనిట్ సభ్యులు
ఫోర్త్ ఫ్లోర్‌లో దీప్సిక, ఆరి అర్జున్
సరికొత్తగా
హాట్‌స్పాట్ 2మచ్


