అప్పుడే సినిమాపై ప్రేమ కలిగింది!
తమిళసినిమా: బాయ్స్ చిత్రంలో నటిస్తున్నప్పుడే నాకు సినిమా వృత్తి పైనా, కళపైనా ప్రేమ ఏర్పడింది. అది తలుచుకుంటేనే లవ్ అధికం అవుతోంది. నా తల్లి నన్ను ఎంతగానో ప్రేమించారు. నేను హీరో కావాలన్నది ఆమె కళ. అదేవిధంగా నా భార్య, పిల్లలను ప్రేమిస్తున్నాను. అలా ప్రేమ అన్నది జీవితంలో ప్రధాన భాగం. కాగా కాదల్ కథై సొల్లవా చిత్ర కథను దర్శకుడు సనిల్ చెప్పగానే వెంటనే నటించడానికి ఓకే చెప్పేశాను. ఈయనతో పాటు విజయ్‌సేతుపతి, జయరామ్, ఆద్మిక, రితికా సేన్ ప్రధాన పాత్రలు పోషించిన కాదల్ కథై సొల్లవా చిత్రాన్ని పెప్పర్ మింట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆకాష్ అమైయా జైన్ నిర్మించారు. మలయాళం దర్శకుడు సనిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శరత్ సంగీతాన్ని, షాజన్ చాయాగ్రహణంను అందించారు. ఈచిత్రం తమిళం, మలయాళం భాషల్లో ఫిబ్రవరి 6న తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు కేఎస్.అదియమాన్, మనోజ్‌కుమార్, రాజ్‌కపూర్, సంగీత దర్శకుడు రమేష్ మాణిక్యం, అడ్డాల వెంకట్రావు పాల్గొన్నారు. సనిల్ మాట్లాడుతూ . తమిళంలో చిత్రం చేయాలన్నది నా కల.జయాపజయాలు ముఖ్యం కాదు ప్రతిభనే ముఖ్యమన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని అడ్డాల వెంకట్రావు పేర్కొన్నారు. నేను ఇళయరాజాకు అభిమానిని కాదు శిష్యుడిని. ఇంతకు ముందు రెండు తమిళ చిత్రాలకు సంగీతాన్ని అందించాను. మళ్లీ ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు శరత్ పేర్కొన్నారు.
అప్పుడే సినిమాపై ప్రేమ కలిగింది!


