మళ్లీ మళ్లీ అధికారం మాదే! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ అధికారం మాదే!

Jan 25 2026 7:06 AM | Updated on Jan 25 2026 7:06 AM

మళ్లీ

మళ్లీ మళ్లీ అధికారం మాదే!

●సాధ్యా అసాధ్యా నివేదికకు చర్యలు

న్యూస్‌రీల్‌

అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్‌ ధీమా

ద్రావిడ మోడల్‌ 2.ఓతో రికార్డుల బద్దలు

గవర్నర్‌ తీరు ప్రజా పాలనకు సవాల్‌

ముగిసిన సభా పర్వం

చివరి రోజు అన్నాడీఎంకే బహిష్కరణ

స్టాలిన్‌కు తమిళిసై పది ప్రశ్నలు

చైన్నె శివార్లలో వర్షం

సాక్షి, చైన్నె: శనివారం వేకువజాము నుంచి చైన్నె, శివార్లలో అక్కడక్కడ చిరు జల్లులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షాలు మూడు రోజుల పాటు ఉత్తర తమిళనాడు, డెల్టా జిల్లాల్లో కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య రుతు పవనాల సీజన్‌ రెండు రోజుల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. ఇక, చలి తీవ్రత పెరిగింది. అదే సమయంలో మధ్యాహ్నం కాస్త భానుడి ప్రతాపం కూడా కనిపిస్తోంది. ఈ పరిస్థితులలో ఆకాశం మేఘావృతంగా మారింది. చైన్నె, శివారు జిల్లాలో తేలిక పాటి వర్షం అప్పుడప్పుడు అక్కడక్కడ కురిసింది. చలి నేపథ్యంలో తాజాగా మారిన వాతావరణంతో ప్రజలలో ఆందోళన బయలు దేరింది. ఇప్పటికే సీజన్‌ జ్వరాలు స్వైర విహారం చేస్తున్న తరుణంలో మరింత కలవరం నెలకొంది. చైన్నె, శివార్లలోనే కాదు, ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాలు, డెల్టా జిల్లాలు, దక్షిణ తమిళనాడులో కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు అక్కడక్కడ పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

దోమ తెర సమస్యే కాదు!

సాక్షి, చైన్నె: వర్షపు నీటి కాలువ ప్రవేశ మార్గంలో దోమ తెర ఒక సమస్యే కాదని చైన్నె కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌ ప్రియ వ్యాఖ్యానించారు. చైన్నె తిరువొత్తియూరు, తిరువీకానగర్‌ పరిసరాలలో వర్షపు నీటి కాలువల ప్రవేశ మార్గాలలో ఉండే గేట్లకు దోమ తెరను అమర్చి దోమలు బయటకు రాకుండా కార్పొరేషన్‌ సిబ్బంది చేస్తున్న ప్రయత్నం వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో గత పాలనలో ఆవిరి అవుతున్న నీటిని పరిరక్షించేందుకు థర్మాకోల్‌ను ఉపయోగించడాన్ని, తాజాగా దోమలు బయటకు రాకుండా దోమ తెర అమర్చడాన్ని మేళితం చేస్తూ వ్యంగ్యాస్త్రాలు హోరెత్తాయి. ఈ పరిస్థితులలో దోమ తెర వ్యవహారం గురించి మేయర్‌ ప్రియ స్పందిస్తూ ఇది సమస్యే కాదన్నారు. ఇది కార్పొరేషన్‌ నిర్ణయం కాదన్నారు. ఓ కౌన్సిలర్‌ తన వ్యక్తిగత ప్రయత్నంతో తన నివాసం పరిసరాలలో దోమతెరను ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు.

ఊటీలో రోప్‌ కార్‌

సాక్షి, చైన్నె: ఊటీలో రోప్‌కార్‌ సేవలకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం టెండర్ల ఖరారు చేశారు. నీలగిరి జిల్లాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఊటి. ఇక్కడకు రోడ్డు మార్గంలో కన్నా, రైలు మార్గంలో పయనం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బ్రిటీషు హయాంలో మేట్టుపాళయం నుంచి కున్నూరు వరకు తొలుత ఈ రైలు సేవలకు శ్రీకారం చుట్టారు. తర్వాత దశల వారీగా విస్తరించి చివరకు ఊటీ వరకు ఈ రైలు సేవలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక, ఊటీలో పర్యాటక అందాలను తిలకించేందుకు రెండు కనులు చాలవు. పర్యాటక రారాజుగా ప్రసిద్ధి చెందిన ఊటీలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. నిత్యం ఇక్కడకు సందర్శకులు, పర్యాటకులు తరలి వస్తూనే ఉంటారు. ఊటీలో రోప్‌ కార్‌ సేవల కసరత్తులు మొదలయ్యాయి. చైన్నె మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఈ ప్రయత్నంపై దృష్టి పెట్టింది. ఊటీలో రోప్‌ కార్‌ సేవలకు సంబంధించిన సాధ్యా అసాధ్యాల నివేదిక సమర్పణకు గాను టెండర్లను ఆహ్వానించారు. రూ.96.63 లక్షలతో ఈ టెండర్లను ఖారారు చేశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ, బెంగళూరుకు చెందిన మరో సంస్థకు సంయుక్తంగా ఈ పనులను అప్పగించారు. చైన్నె మెట్రో రైల్‌ అధికారులు అర్జున్‌, సిద్ధిక్‌ నేతృత్వంలో అవగాహన ఒప్పందాలు సైతం జరిగాయి.

చెట్టును ఢీకొన్న కారు

ఇద్దరు దుర్మరణం

తిరువొత్తియూరు: చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన కోయంబత్తూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. కోయంబత్తూరు ఇడయార్‌ పాళయం లక్ష్మీనగర్‌కు చెందిన రవి కుమారుడు రోహిత్‌ (18). ఇతని స్నేహితుడు పన్నిమడై బాలాజీ గార్డెన్‌ ప్రాంతానికి చెందిన సుదర్శన్‌ (22). శనివారం తెల్లవారుజామున కోయంబత్తూరు తడాగం దగ్గర పాపనాయక్కన్‌ పాళయం ఎస్‌.పి.ఆర్‌. నగర్‌ మీదుగా వీరిద్దరూ కారులో వెళ్తున్నారు. అక్కడ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును ఢీకొంది. ఈప్రమాదంలో రోహిత్‌, సుదర్శన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సాక్షి, చైన్నె: తమిళనాడులో మళ్లీ మళ్లీ అధికారం డీఎంకే చేతిలోకే అని అసెంబ్లీ వేదికగా సీఎం ఎంకే స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. 2026లో ఏర్పడే ద్రావిడ మోడల్‌ 2.ఓ ప్రభుత్వం గత రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగిశాయి. చివరిరోజు సభను అన్నాడీఎంకే బహిష్కరించింది.

కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం ఈనెల 20న ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు శనివారం గవర్నర్‌ ప్రసంగంలోని అంశాల ఆధారంగా సీఎం స్టాలిన్‌ ప్రత్యేక ప్రసంగం జరిగింది.

15 వేలకు పైగా సంతకాలు

సభలో 34 నిమిషాల పాటు సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధికార పగ్గాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, అన్నాడీఎంకే అధ్వాన పాలన రూపంలో అప్పడున్న పరిస్థితుల నేపథ్యంలో అధికారం తీసుకొని, కేంద్రం నుంచి సహకారం కొరవడినా, ద్రావిడ మోడల్‌తో విజయవంతంగా పథకాలను అమలు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శకంగా తమిళనాడును నిలబెట్టామన్నారు. ఇదే రానున్న ఎన్నికల్లో డీఎంకేకు మళ్లీ విజయాన్ని చేకూర్చుతాయని ధీమా వ్యక్తం చేశారు. ద్రావిడ మోడల్‌ 2.ఓ ప్రభుత్వంలో గత రికార్డులన్నీ బద్దలు కొట్టే విధంగా పథకాలు అమలు అవుతాయని, ఆమేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా 2.23 కోట్ల కుటుంబాలు ఆనందంగా పండుగ జరుపుకునే విధంగా రూ. 3 వేలు అందించామమన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల 23 ఏళ్ల కలను సాకారం చేశామన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీలలో తమిళనాడుకు చెందిన క్రీడాకారులు రాణించారని, వీరిలో 200 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. శనివారం నాటికి 1,724 రోజుల పాలనలో 15,117 ఫైళ్లపై సంతకాలు చేసి బృహత్తర పథకాలు, కార్యక్రమాలు అమలు చేశామని వివరించారు.

చైన్నెకి ఇటాలియన్‌ రోటేరియన్లు

సాక్షి, చైన్నె : ఇటలికి చెందిన 74 ఏళ్ల ఈఎన్‌టీ నిపుణుడు, రోటేరియన్‌ గియుసెప్పే దంపతులు సాంస్కృతిక అంశాలను వీక్షించేందుకు చైన్నెకి చేరుకున్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ యూనైటెడ్‌ సదస్సు ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ 3233 నేతృత్వంలో చైన్నెలో జరిగింది. ఉత్తర ఇటలీలోని రోటరీ ఇంటర్నేషనల్‌కు చెందిన గియుసెప్పే సముద్ర యానం ద్వారా దేశంలో పలు నగరాలలో పర్యటించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా తన సతీమణి లయురిటస్పడతో కలసి చైన్నెకు వచ్చిన ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. తూర్పు, పశ్చిమ దేశాల సాంస్కృతిక మార్పిడిల గురించి ఈ సదస్సులో వివరించారు. భారత దేశం అంతటా ప్రయాణించి, ఉత్తర ఇటలీలోని ఒక చారిత్రాత్మక పట్టణంలో చేపట్టనున్న అంశాలను వివదీకరించారు. ఈసందర్భంగా రోటరీ నిర్వాహకులు అరుల్‌ కాంత్‌ జయకాంతన్‌ వారికి ఇక్కడి వారసత్వం, సంప్రదాయలు, సంస్కృతికి గురించి వివరించారు. అలాగే, ఇంటర్నేషనల్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ మహేశ్‌ కుమర గురుబరన్‌ వివిధ ఖండాలతో స్నేహ సంబంధాల , అనుసంధానం గురించి తెలియజేశారు.

సీఎం ప్రకటనలు

అసెంబ్లీ వేదికగా సీఎం కొన్ని ప్రకటనలు చేశారు. ఆ మేరకు...

కలైంజ్ఞర్‌ గృహ ప్రాజెక్టు ద్వారా రూ.3,500 కోట్లతో 2 లక్షల గృహాలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంటూ, మరో లక్ష ఇళ్ల నిర్మాణానికి సిద్ధం.

రూ.8,911 కోట్లతో 20,484 కిలోమీటర్ల లోపు గ్రామీణ రోడ్లు మెరుగుపడ్డాయని పేర్కొంటూ, అదనంగా 2,200 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు మెరుగు పరచనున్నాం.

పేదలు, అణగారిన వర్గాలు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, వితంతువులు, వ్యవసాయ దారులు, కార్మికులు, రైతులు భర్తలు వదిలేసిన నిస్సహాయ మహిళలు, 50 ఏళ్లు పైబడిన నిరుపేద, అవివాహిత మహిళలకు నెలవారీ పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న లక్షా 80 వేల మందికి ఫిబ్రవరిలో పెన్షన్‌ మంజూరు అవుతుందని ప్రకటించారు.

పౌష్టికాహార కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్‌ను రూ. 2 వేల నుంచి రూ.3,400 వరకు పెంపు. పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక పెన్షన్‌ రూ. 2వేల నుంచి రూ. 3వేలకు పెంపు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరణిస్తే, వారి కుటుంబానికి రూ.1,200 కుటుంబ పెన్షన్‌

ప్రభుత్వ పాఠశాలల్లో పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి డిమాండ్లను పరిష్కరించే విధంగా జీతాల పెంపు, సెలవు ప్రయోజనాల వర్తింపు శాశ్వత ఉపాధికి చర్యలు.

కొరుక్కుపేట: ప్రధాని మోదీ నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొనడానికి చైన్నె వచ్చారు. ఈ సందర్బంలో ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ సంచలనాత్మక 10 ప్రశ్నలు అడిగారు. దీనికి ప్రతి స్పందిస్తూ, మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఎక్స్‌సైట్‌లో పోస్ట్‌కు ప్రతి స్పందిస్తూ, మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎక్స్‌ సైట్‌లో పోస్ట్‌ చేశారు.

తమిళనాడులో పంచాయతీల డీలిమిటేషన్‌ను మార్చి, స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా నిర్వహించకుండా మీరు అన్యాయం చేస్తున్నారు. గవర్నర్‌ను చూసి మీ పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. దానికి సమాధానం ఏమిటి, తమిళ వర్సిటీలలో తమిళ రక్షకులమని మిమ్మల్ని మీరు పిలుచుకోడవం ఏంటి. ఉపాధికి గాంధీ పేరు మార్చ వద్దని మీరు చెప్పినా, తమిళనాడులో ఎన్ని ప్రాజెక్టులకు గాంధీ పేరు పెట్టారు, అవన్నీ ఆ కరుణానిధి పేరు మీద ఉన్నాయి. కేంద్రంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎయిమ్స్‌ తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నించలేదు. చైన్నెకి కేటాయించిన రూ.4 వేల కోట్లతో మీరు ఏమి చేశారు. చైన్నెలో వర్షాకాలం దగ్గర పడింది. ఈ రోజు మీరు తమిళనాడుకు ఎన్ని విమానాశ్రయాలు హై–స్పీడ్‌ రైళ్లను తీసుకొచ్చారో చెప్పగలరా, మీరు ఎన్ని పురావస్తు తవ్వకాలకు నిధులు కేటాయించారు, ప్రాచీన తమిళ భాషను తిరిగి తీసుకురావడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి, అని తమిళిసై ప్రశ్నలు సంధించడం చర్చ నీయాంశంగా మారింది.

గవర్నర్‌ తీరుపై ఆగ్రహం

అసెంబ్లీలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వ్యవహరిస్తున్న విధానాన్ని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళనాడుకు, తమిళ ప్రజలకు వ్యతిరేకంగా గవర్నర్‌ పని తీరు ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచిని కూడా సభలో ప్రసంగించబోనంటూ ఆయన వాకౌట్‌ చేయడం చూస్తే, భారత రాజ్యాంగాన్ని ఏ మేరకు అవమానిస్తున్నారో స్పష్టం అవుతోందన్నారు. దివంగత నేతలు అన్నా, కలైంజ్ఞర్‌ కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలితలు కూడా ఇప్పటివరకు ఎదుర్కోని సమస్యలు, సంక్షోభాలను గవర్నర్‌ రూపంలో తాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలోని టాప్‌ 50 వర్సిటీలలో 10 తమిళనాడులోనే ఉన్నాయన్న విషయాన్ని కూడా మరిచి ఉన్నత విద్యకు వ్యతిరేకంగా గవర్నర్‌ చౌకబారు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో భద్రత లేదని, పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. కేంద్రం నుంచి 65కు పైగా అవార్డులను తాము సొంతం చేసుకుని ఉన్న విషయాన్ని గవర్నర్‌ గుర్తెరగాలని హితవు పలికారు. చివరి రోజు సభను అన్నాడీఎంకే బహిష్కరించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేగా సభలో ఉన్న బహిష్కృత నేత పన్నీరుసెల్వం, ఆయన మద్దతు ఎమ్మెల్యే ఒకరు సభకు వచ్చారు. ఇక, బీజేపీ తరఫున వానతీ శ్రీనివాసన్‌ మాత్రమే హాజరయ్యారు. అసెంబ్లీలో గతంలో ఆమోదించి, గవర్నర్‌ తిరస్కరించిన సహకార సంఘాల సవరణకు సంబంధించిన ముసాయిదా మళ్లీ సభా ఆమోదం పొందింది. ఇక స్కూల్‌ ఫీజు రివ్యూ కౌన్సిల్‌ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఫీజు నిర్ణయ కమిటీలో ఇక తల్లిదండ్రులు సైతం సభ్యులుగా ఉంటారు.

మళ్లీ మళ్లీ అధికారం మాదే!1
1/3

మళ్లీ మళ్లీ అధికారం మాదే!

మళ్లీ మళ్లీ అధికారం మాదే!2
2/3

మళ్లీ మళ్లీ అధికారం మాదే!

మళ్లీ మళ్లీ అధికారం మాదే!3
3/3

మళ్లీ మళ్లీ అధికారం మాదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement