కోస్ట్ గార్డ్ బైక్ ర్యాలీ
సాక్షి, చైన్నె: కోస్ట్‌గార్డ్ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సముద్ర భద్రత, తీర ప్రాంత భద్రత, సమాజ నిబద్ధతను చాటే విధంగా బైక్ యాత్రకు చర్యలు తీసుకున్నారు. చైన్నెని కోస్ట్ గార్డ్ రీజియన్ (తూర్పు)విభాగం నేతృత్వంలో 50 మంది కోస్ట్ గార్డ్ రైడర్లు తూత్తుకుడి, విశాఖ పట్నం నుంచి రెండు మార్గాలలో ఐదు రోజులపాటు ప్రయాణించి చైన్నెకి చేరుకున్నారు. విశాఖ పట్నం నుంచి వచ్చిన ర్యాలీని కోస్టు గార్డ్ జిల్లా కమాండర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజేష్ మిట్టల్ జెండా ఊపి ప్రారంభించారు. తూత్తుకుడి నుంచి వచ్చిన ర్యాలీకి కస్టమ్స్ కమిషనర్ వికాష నాయర్‌జెండా ఊపారు. శనివారం ఈ రెండు ర్యాలీలు చైన్నెకి చేరుకున్నాయి. కోస్టు గార్డ్ రీజియన్ ఈస్ట్ కమాండర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీఎస్ సైనీ ర్యాలీని ఆహ్వానించారు. రైడర్లను సత్కరించారు. వారి అంకిత భావం, కృషిని అభినందించారు. సముద్ర దళాల సైనికులు, భారత తీర రక్షణ దళం పాత్రను గుర్తు చేశారు. సముద్ర ప్రయోజనాలను కాపాడే విధంగా భద్రతను నిర్ధారించే విధంగా సేవలను వివరించారు.
చైన్నెలో కోస్టుగార్డ్ ర్యాలీ
కోస్ట్ గార్డ్ బైక్ ర్యాలీ


