రైలు పట్టాల పక్కన గాలి పటాలు ఎగరేయొద్దు
తిరువొత్తియూరు: రైలు పట్టాల పక్కన నిలబడి మాంజా దారంతో గాలి పటాలు ఎగురవేయకూడదని రైల్వే రక్షణ శాఖ పోలీసులు పిల్లలకు సూచనలు చేశారు. తమిళనాడులో పొంగల్ పండగ కారణంగా క్రీడా పోటీలు జరుగుతాయి. అదేవిధంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయడంలో నిమగ్నమవుతారు. ఈ నేపథ్యంలో నిషేధించిన మాంజా దారాన్ని ఉపయోగించవద్దని పోలీసులు నిషేధం విధించారు. ఇది ఒకవైపు ఉండగా రైల్వే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రైలు పట్టాల పక్కన గాలిపటం ఎగురవేస్తున్నప్పుడు, అది హై టెన్షన్ విద్యుత్ తీగల్లో చిక్కుకునే అవకాశం ఉందని దీని కారణంగా అగ్నిప్రమాదం సంభవించవచ్చు. రైలు రవాణాకు కూడా అంతరాయం కలుగుతుంది. ఇలాంటి పనులు ప్రాణాలకు కూడా ప్రమాదకరమని ,కావున గాలిపటాలు ఎగురవేయడానికి సురక్షితమైన ప్రదేశాలను మా త్రమే ఎంచుకోవాలి. ఇందులో విద్యార్థులు, తల్లి దండ్రులు ఈ ప్రకటనను పాటించాలని కోరారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: శ్రీవారిని మంగళవారం సినీ నటుడు విజయ్‌కుమార్, నటి ప్రీతి దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు.


