సొధారణ వ్యక్తి జీవిత కథగా మెల్లిసై | - | Sakshi
Sakshi News home page

సొధారణ వ్యక్తి జీవిత కథగా మెల్లిసై

Jan 9 2026 7:34 AM | Updated on Jan 9 2026 7:34 AM

సొధారణ వ్యక్తి జీవిత కథగా మెల్లిసై

సొధారణ వ్యక్తి జీవిత కథగా మెల్లిసై

తమిళసినిమా: మంచి కంటెంట్‌ కథా చిత్రాలకు తమిళ ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి ఒక వైవిధ్యభరిత కథాంశంతో పొందుతున్న తాజా చిత్రం మెల్లిసై. కిషోర్‌, సుభద్ర రాబర్ట్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో జార్జ్‌ మరియన్‌, హరీష్‌ ఉత్తమన్‌, నూతన తారలు తనన్య, జస్వంత్‌ మణికంఠన్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ధీరవ్‌ నిర్వహిస్తున్నారు. హేస్టేక్‌ ఎఫ్‌డీఎఫ్‌ఎస్‌ ప్రొడక్షన్‌న్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శంకర్‌ రంగరాజన్‌ సంగీతాన్ని, దేవరాజ్‌ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపై రావడానికి ముస్తాబవుతోంది. ఈచిత్రం గురించి నటుడు కిశోర్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ నెరవేరని కలలు, బాధ్యతలు, నమ్మకం కలిగిన ఒక సాధారణ వ్యక్తి జీవిత కథగా మెల్లిసై కథ ఉంటుందని దర్శకుడు చెప్పారన్నారు. ఇందులోని పాత్రను తాను ఎంతో ప్రేమిస్తూ నటించానని చెప్పారు. ఈ పయనాన్ని అత్యంత యథార్థంగా మార్చిన దర్శక నిర్మాతలు, సహా నటీనటులు ,సాంకేతిక వర్గానికి కతజ్ఞతలు అని పేర్కొన్నారు. అందరం కలిసి మనస్ఫూర్తిగా పనిచేయడం వల్లే ఈ చిత్రం మరింత స్పెషల్‌గా మారిందని కిశోర్‌ తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభవాన్ని కలిగిస్తుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement