లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Jan 6 2026 7:21 AM | Updated on Jan 6 2026 7:21 AM

లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

తిరువళ్లూరు: పదో తరగతి బాలికతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయాన్ని ఉపయోగించి ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేసిన వ్యవహారంలో నిందితుడికి జీవితఖైదు శిక్షతో పాటు అదనంగా 33 ళ్ల జైలు జీవితాన్ని ఏకకాలంలో అనుభవించాలని తిరువళ్లూరు ఫోక్సో కోర్టు న్యాయస్థానం న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. తిరువళ్లూరు జిల్లా పూందమలికి చెందిన పదో తరగతి బాలికకు విల్లుపురం జిల్లా వలవనూర్‌ కుమారకుప్పం గ్రామానికి చెందిన కాళీ కుమారుడు శక్తివేల్‌(26) పరిచయమయ్యాడు. అనంతరం ప్రేమలో దించి తనకు ఇంతకు ముందే వివాహమైన విషయాన్ని దాచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అనంతరం పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేయడంతోపాటు గర్భవతిని చేశారు. అయితే శక్తివేల్‌కు ఇంతకు ముందే వివాహమైన విషయం బాలికకూ తెలియడంతో బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అప్పట్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరిస్తూ పదో తరగతి బాలికను వంచించి గర్భవతిని చేసిన నిందితుడికి జీవితఖైదు శిక్షతోపాటు మరో 33 ఏళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు నిందితుడికి 65 వేల రూపాయల జరిమానాతో పాటు ఐదు లక్షల రూపాయలను బాలికకూ పరిహారంగా ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం నిందితుడిని పుళల్‌ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement