టెక్నాలజీ భవిష్యత్తు రూపకల్పనలో క్వాంటం
సాక్షి, చైన్నె : టెక్నాలజీ భవిష్యత్తు రూపకల్పనలో క్వాంటం డాట్స్ కీలకంగా మారిందని కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మౌంగి జీ బావెండి తెలిపారు. ప్రదర్శనలకు మించి ఎనర్జీ హార్వెస్టింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లోకి ఇది విస్తరించిందని వివరించారు. చైన్నెలోని హిందూస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నేతృత్వంలో క్వాంటం హారిజన్స్ 2025 మెటీరియల్స్, ఇంటెలిజెంట్ టెక్నాలజీ, సస్టయినబుల్ ఫ్యూచర్స్ గురించి అంతర్జాతీయ సదస్సు గురువారం జరిగింది. క్వాంటం సైన్స్, అధునాతన సాంకేతికలలో ఉద్భవిస్తున్న పరిణామాలను గురించి ఇందులో అంతర్జాతీయ స్థాయి శాస్త్ర వేత్తలు, నిపుణులు, విదావేత్తలు చర్చించారు. ఇందులో కాటం డాట్స్‌పై తన మార్గదర్శక కృషి గురించి ప్రొఫెసర్ బావెండి వివరించారు. క్వాంటం పదార్థాలు, ఆవిష్కరణ మార్గాలు, ప్రాథమిక శాస్త్రాన్ని వాస్తవ ప్రపంచ సాంకేతికలతోకి అనువదించడం గురించి విశదీకరించారు. టెక్నాలజీ భవిష్యత్తు రూపకల్పనలో క్వాంటం కీలక భూమిక కానుందన్నారు. క్వాంటం ఇన్పర్మేషన్ సిస్టమ్స్ వంటి సహద్దు పరిశోధశన రంగాలు, భవిష్యత్తులో కంప్యూటింగ్, శక్తి , సెన్సింగ్ ఆర్కిటెక్చరలను రూపొందించే అవకాశాలను తెలియజేశారు. ముందుగా క్వాంటం హారిజన్స్ ఉద్దేశాలతో సావనీరును విడుదల చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఐటీఎస్ ప్పొ చాన్స్‌లర్ డాక్టర్ అశోక్ జార్జ్ వర్గీస్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ అజయన్ విను, జెట్వెర్క్ సీఈఓ జోష్ ఫౌల్గర్, ఐఐటీ రోపర్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ అహుజా తదితరులు పాల్గొన్నారు.


