యువ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్‌గా పొన్ షర్మిణి
సాక్షి, చైన్నె: తిరునల్వేలికి చెందిన ఆర్ పొన్ షర్మిణి యువ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్‌గా వైమానిక దళంలో నియమితులయ్యారు. ఆర్థికంగా కష్టతరమైన కుటుంబం నుంచి ఒక్కో మెట్టుగా ఎదిగా తాజాగా తమిళ మహిళలకు ఆదర్శకంగా భారత వైమానిక దళంలో ఫ్లయింగ్ ఆఫీసర్ విధులలో షర్మిణి చేరారు. పట్టుదల, దృఢ సంకల్పం, అచంచలమైన కలలు తనకు ఈ బాధ్యతలను దరి చేర్చిందని షర్మిణి పేర్కొన్నారు. తమిళనాడులోని తిరునల్వేలిలో పుట్టి చైన్నెలో పెరిగిన ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కష్ట జీవులే. చిన్నతనం నుంచి షర్మిణి పాఠశాల, కళాశాల రోజుల్లో చురుకై న అథ్లెట్‌కావడం గమనార్హం. ఎన్‌సీసీ విద్యార్ధినిగా క్రీడాకారిణిగా రాణించినా, ఆర్థిక పరిమితుల కారణంగా అథ్లెట్ కావాలన్న కలన పక్కన పెట్టారు. స్కాలర్‌షిప్ ద్వారా తన చదువుపై దృష్టి పెట్టారు. తన కుటుంబ భారాన్ని తగ్గించడానికి ఆమె పిల్లలకు ట్యూషన్ చెప్పడం నుంచి టూర్ గైడ్‌గా పనిచేయడం వరకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో చేరారు. అక్కడ, ఆమె కొంతమంది రిటైర్డ్ ట్రై–సర్వీస్ అధికారుల క్రింద పనిచేసింది. వారి కథలు భద్రతా దళాల సేవలను పరిగణించి తాను సైతం యూనిఫాం ధరించాలని శ్రమించారు. ఆమె కష్టం, ఆమె పట్టుదల చివరికి పోటీ పరీక్షలో ఉత్తీర్ణురాలిని చేసింది. ఇప్పుడు భారత వైమానిక దళంలో భాగమయ్యారు. తెలంగాణలోని దుండిగల్ ఎయిర్ ఫోర్సు అకాడమిలో శిక్షణ పూర్తి చేసిన షర్మిణి శనివారం జరిగిన పరేడ్‌తో డబ్ల్యూసీసీ మహిళా క్యాడెట్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. అలాగే, ఆమె కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో అధికారిగా నియమించారు. త్రివిధ దళాలలో చేరాలన్న ఆశతో ఉన్న యువతకు షర్మిణి ఓ ప్రేరణగా తమిళనాట మారారు.


