ఎంటీసీలో పింక్ ఫోర్స్
సాక్షి, చైన్నె: మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్( చైన్నె ఎంటీసీ)లో మహిళా డ్రైవర్లు, కండెక్టర్లు సత్తా చాటబోతున్నారు. వీరికి పింక్ ఫోర్స్ అని నామకరణం చేశారు. చైన్నె నగరంలో అలవోకగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపేస్తామంటూ ప్రత్యేక శిక్షణలో మహిళా డ్రైవర్లు 70 మంది నిమగ్నమై ఉన్నారు. వీరిలో పలువురు పట్టభద్రులు సైతం ఉన్నారు. వివరాలు.. మహిళలో జీవనోపాధిని పెంపొందించే విధంగా ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. స్వయం సహాయక బృందాల ద్వారా వివిధ చేతి వృత్తులతయారీలో తమిళనాడు మహిళలు దూసుకెళ్తున్నారు. అలాగే వివిధ పరిశ్రమలలో మహిళలకు పెద్ద పీట వేసే విధంగా ఉద్యోగ అవకాశాలకల్పన విస్తృతం చేశారు. అలాగే , డ్రైవర్లుగా ప్రైవేటు బస్సులు, ఆటోలు,కార్లు నడుపుతున్న మహిళలు సైతం అధికంగా ఉన్నారు. వీరికి ప్రత్యేక రాయితీతో ఆటోలను అందజేస్తూ వస్తున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దూసుకెళ్తున్న తరుణంలో ఎంటీసీలో డ్రైవర్లు, కండెక్టర్లుగా మహిళల బలాన్ని చాటే దిశగా శిక్షణ సాగుతుండటం విశేషం.
ఎంటీసీలోకీ..
ప్రైవేటు వాహనాలు, బస్సులను నడిపే మహిళలు అనేక మందిఉన్నారు. అయితే, ప్రభుత్వ బస్సులలో ఇలాంటి నియామకాలు జరగలేదు. కండెక్టర్లుగా మహిళలు పనిచేస్తున్నారు. అయితే, మహిళా స్పెషల్‌గా ఇక, మహిళా డ్రైవర్, మహిళా కండెక్టర్‌తో ఎంటీసీ ఎలక్ట్రిక్ బస్సులు పలు మార్గాలలో రోడ్డెక్కించనున్నారు.
చైన్నెలో రోజుకు 3,233 బస్సులను ఎంటీసీ నడుపుతోంది. దీని ద్వారా 40 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ బస్సులలో మహిళ డ్రైవర్లు, కండెక్టర్ల నియామకం దిశగా కసరత్తు చేసి ఉన్నారు. మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్ట్‌కార్పొరేషన్ చొరవతో పింక్ ఫోర్స్ పేరిట మహిళ డ్రైవర్, కండెక్టర్‌లను రంగంలోకి దించనున్నారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా పింక్‌ఫోర్స్ నుంచి వ్యాసార్పాడి నుంచి వళ్లలార్ నగర్ వరకు ఓ బస్సును ప్రయోగాత్మకంగా నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ బస్సు డ్రైవర్‌గా మాణిక్య వళ్లి, కండెక్టర్‌గా ఈశ్వరి నియమితులయ్యారు. ఈ బస్సును అధికంగా మహిళలు ఉపయోగిస్తుండడంతో ఇక, విస్తరణ దిశగా చర్యలపై దృష్టి పెట్టారు. తనకు డ్రైవర్ అవకాశం దక్కడం గురించి మాణిక్య వళ్లి స్పందిసూ్‌త్ గత 8 సంవత్సరాలు తాను ఆటో నడిపినట్టు, పింక్ ఫోర్సుసమాచారంతో నాన్‌మొదల్వన్ పథకం ద్వారా శిక్షణ పొందానని వివరించారు. తాజాగా తనకు అవకాశం దక్కిందని, పూర్తి స్థాయిలో వివిధ మార్గాలలో బస్సునడిపేందుకు తాను సిద్ధం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక, 70 మంది డ్రైవర్లు శిక్షణలో ఉన్నట్టు ఎంటీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరిలో అనేక మంది పట్టభద్రులైన మహిళలు ఉండటం విశేషం. అలాగే, కండెక్టర్ల నియామకానికి సంబంధించిన చర్యలు విస్తృతం చేశామని పేర్కొన్నారు. వీరికి ఎలక్ట్రిక్ బస్సు నడిపేందుకు శిక్షణ ఇస్తున్నామని, త్వరలో కొనుగోలు చేయనున్న ఎలక్ట్రిక్ బస్సులలో అనేక మంది మహిళలు డ్రైవర్లు, కండక్టర్లుగా ఉంటారని ఎంటీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఎంటీసీలో పింక్ ఫోర్స్


