వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షిస్తాం..!
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా వున్న వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని తమిళనాడు వక్ఫ్‌బోర్డు కమిటీ సభ్యుడు డాక్టర్ సుబేర్‌ఖాన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన సుబేర్‌ఖాన్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ప్రవేశ పెట్టిన పథకాలు, లబ్ధిదారుల వివరాలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి వేర్వేరు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం 19 మంది లబ్ధిదారులకు రూ.2.10 లక్షలు విలువ చేసే సహాయకాలను పంపిణీ చేశారు.


