విజయ్‌కూ.. ప్రశాంత్ కిషోర్ గతే..
– నైనార్ నాగేంద్రన్
సాక్షి, చైన్నె: బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్‌కు పట్టిన గతే తమిళనాట విజయ్‌కు సైతం తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ హెచ్చరించారు. డీఎంకేకు వ్యతిరేకంగా తమిళగ వెట్రికళగం (టీవీకే) నేత విజయ్ వ్యాఖ్యల తూటాలను పేల్చుతున్న విషయం తెలిసిందే. బీజేపీని సైతం తీవ్రంగానే ఆయన వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో తమిళనాట 2026 ఎన్నికల్లో ఎన్నికల సమరం డీఎంకే, టీవీకే మధ్య మాత్రమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో విజయ్‌ను తమతో చేతులు కలిపే విధంగా బీజేపీ, అన్నాడీఎంకేలు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నా, ఆయన ఏమాత్రం చిక్కడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈపరిస్థితుల్లో బిహార్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికల గురించి బుధవారం నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, బిహార్‌లో జనసురాజ్ పార్టీ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఏ విధంగా ఓటర్లు చావు దెబ్బ తీశారో అదే పరిస్థితి ఇక్కడ విజయ్‌కు సైతం తప్పదని హెచ్చరించారు. దివంగత నేత ఎంజీఆర్‌కు రాజకీయంగా అపార అనుభవం ఉందని, ఆయనతో మరో నటుడ్ని పోల్చలేమని వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ప్రశాంత్ కిషోర్‌కు డిపాజిట్లు గల్లంతయ్యాయయని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు ఇలాంటి పరాభవం తప్పదన్నారు. ఇదిలా ఉండగా, పొత్తుకు సై అంటే విజయ్‌తో మాట్లాడేందుకు తమ నేత పళనిస్వామి ద్వారా ప్రయత్నాలకు సిద్ధమని అన్నాడీఎంకే నేత కేటీ రాజేంద్ర బాలాజీ అనడం గమనార్హం. విజయ్ 2010లోనే కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నించినట్టుగా ఆ పార్టీ కరూర్ ఎంపీ జ్యోతిమణి మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యల తూటాలు అందుకున్నారు. తమ నేత రాహుల్‌కు విజయ్ కొత్తేమీ కాదన్నారు.


