
గవర్నర్ తీరు
అసెంబ్లీలో సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు
సిద్ధ్ద వైద్య వర్సిటీ బిల్లుకు మరోసారి ఆమోదం
ఆయన సిఫార్సులను అంగీకరించబోమని స్పష్టీకరణ
కొత్తగా చేరిన వారికీ మహిళా హక్కు పథకం: ఉదయనిధి
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మూడో రోజై గురువారం కూడా వాడీవేడి వాదనలు జరిగాయి. తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి శేఖర్‌బాబు సమాధానం ఇస్తూ, 4 వేల ఆలయాలను పునరుద్ధ్దరించామని, తమిళ కడవుల్ మురుగన్‌ను కీర్తించే పాలన తమిళనాట సాగుతోందని వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఏవీ వేలు సమాధానం ఇస్తూ, మదురై గోరి పాళయం వంతెనను జనవరిలో ప్రారంభించనున్నామని ప్రకటించారు. పెరంబూరు పరిసరాలకు వివిధ ప్రాంతాల నుంచి అదనపు బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శివ శంకర్ వివరించారు. దివంగత నేత అన్నా రచించిన పుస్తకాలను ఇతర భాషలలోకి సైతం తర్జుమా చేయడానికి చర్యలు చేపట్టనున్నామని మంత్రి స్వామినాథన్ తెలిపారు. మంత్రి చక్రపాణి పేర్కొంటూ, వరి ఉత్పత్తి రాష్ట్రంలో 3 .5 లక్షల ఎకరల నుంచి 6 లక్షల ఎకరాలకు పెరిగినట్టు వివరించారు.
డిసెంబరులో నగదు
కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం గురించి సభలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రకటన చేశారు. 2023 సెప్టెంబర్ 15న ఈపథకం ప్రారంభించామని గుర్తు చేస్తూ, తాజాగా 1.14 కోట్ల మంది లబ్దిదారుల ఉన్నట్టు వివరించారు. వీరందరి ప్రతి నెల రూ. 1000 నగదు బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతోందన్నారు. ఇటీవల కాలంగా జరుగుతున్న శిబిరాలు నవంబర్ 30తో ముగియనున్నట్టు తెలిపారు.ఈ పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న అర్హులైన మహిళలకు డిసెంబర్ 15 నుంచి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని ప్రకటించారు.
ఆర్థిక నివేదికపై చర్చ
సభలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆర్థిక నివేదికకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తూ, ప్రసంగించారు.నిధుల కొరత రూ.నాలుగు వేల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంటూ,ఇందుకు కేంద్రం చూపుతున్న సవతి తల్లి ప్రేమే కారణం అని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా వచ్చి ఉంటే అపుపలు రూ. 3 లక్షల కోట్ల వరకు తగ్గి ఉండేదన్నారు. అన్నాడీఎంకే హయాంలో చేసిన లక్షా 40 వేల కోట్ల అప్పుకు తాము వడ్డీ చెల్లిస్తున్నామని సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది. నిధుల వాటా తగ్గిసుతి. కేంధ్రం నుంచి రావాల్సిన నిధులు తీ మూడు లక్షల కోట్ల వరకు తగ్గుతుంది. అప్పులలో ఉన్నట్టు ప్రతి పక్షాల నేత చెప్పడం తప్పు. అన్నాడీఎంకే లక్షా 40 వేల కోట్లకు డీఎంకే వడ్డీ చెల్లిస్తున్నట్టు వివరంచారు. ఈ సమయంలో ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామి సందించిన ప్రశ్నలకు సీఎం స్టాలిన్‌సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ బకాయిలను విరవిస్తూ, కేంద్రంలోని బీజేపీ పాలకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం , కష్టాలు,నష్టాలకు గురి చేయడం లక్ష్యంగా పథకం ప్రకారంతో ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. తాము పలు మార్లు విన్నవించామని, వారి నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో ఉన్న దృష్ట్యా, ప్రధానితో మాట్లాడి నిధులు ఇప్పించినా లేదా ఒత్తిడి తెచ్చి విడుదల చేయించినా ఆనందమే అని వ్యాఖ్యలు చేశారు.
కిడ్నీలు జాగ్రత్త
సభకు అన్బుమణి మద్దతు పీఎంకే సభ్యులు శివకుమార్, సదా శివం, వెంకటేష్‌లు నల్ల చొక్కాలతో వచ్చారు. తమ పార్టీ శాసన సభా పక్ష నేత, విప్‌లను మార్చాలని విన్నవించినా, స్పీకర్ ఖాతరు చేయక పోవడాన్ని నిరసిస్తూ నల్ల చొక్కాలతో వచ్చినట్టు ప్రకటించారు. ఇక, పెరంబలూరు, ఈరోడ్‌లలో జరిగిన కిడ్నీల అపహకరణ కేసులను గుర్తుచేస్తూ, కిడ్నీలు జర భద్రం అన్ననినాదాలతో కూడిన బ్యాడ్జీలతో అన్నాడీఎంకే సభ్యులు సభకు వచ్చారు. సభలో పళణి స్వామి మాట్లాడుతూ, కిడ్నీల అపహరణ ముఠాపై చర్యలు ఏదీ అని నిలదీశారు. హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు భయం ఎందుకో..?, అప్పీలుకు వెళ్లింది ఎందుకో? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ స్పందిస్తూ, కిడ్నీల అపహరణ కేసు పక్ష పాతం, వివక్షత అన్నది లేకుండా జరుగుతున్నదని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఐఎఎస్ వినిత్ నేతృత్వంలో విచారణ బృందం గురించి ప్రస్తావిస్తూ, కిడ్ని రాకెట్‌లో ఉన్న ఆ రెండు ఆస్పత్రులలో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు నిషేదం విధించామన్నారు. ఇక, అసెంబ్లీలో 28 జిల్లాలోని స్థానిక సంస్థలలో పంచాయతీ ప్రత్యేక అధికారుల పదవీ కాలం పొడిగిస్తూ, 22 విశ్వ విద్యాలయాలలో టీఎన్‌పీఎస్సీ ద్వారా బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయడానికి గాను ముసాయిదాలు దాఖలు అయ్యాయి. ఇక, సభలో బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్‌కు సీఎం స్టాలిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

గవర్నర్ తీరు

గవర్నర్ తీరు