
బస్సుల రైట్..రైట్
గురువారం నుంచే జనం స్వస్థలాలకు పయనమయ్యారు. తమిళనాడుకు చెందిన వారే కాదు, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు సైతం స్వస్థలాకు కదలడంతో రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. చైన్నెలోని అన్ని స్టేషన్లలో నిఘా పెంచారు. బాణసంచా, ఇతర పేలుడు వస్తువులు తరలించకుండా తనిఖీలు క్షుణ్ణంగా చేస్తున్నారు. ఉత్తరాది వైపుగా వెళ్లే రైళ్లు కిక్కిరిశాయి. ఇక, తమిళనాడులోని దక్షిణ జిల్లా, కొంగు మండలం జిల్లా వైపుగా సైతం రైళ్లు కిట కిటలాడాయి. రద్దీని పరిగణించిన రైల్వేయంత్రాంగం అదనపురైలు సేవలకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ నేతృత్వంలో చైన్నెలోని కోయంబేడు, మాధవరం, కేకేనగర్,కిలాంబాక్కం, పూందమల్లిల నుంచి ఆయా మార్గాలలో ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించారు. ఇక ఆమ్నీప్రైవేటు బస్సుల దోపిడీకి కల్లెం వేసే విధంగా నిఘా పెంచారు. అధిక చార్జీలపై ఫిర్యాదుల కోసం వాట్సాప్ నెంబర్లు, టోల్ ప్రీ నెంబర్లు ప్రకటించారు.టోల్ ప్రీ 18004256151, చైన్నె,మదురై,కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునల్వేలి, సేలం, తదితర రవాణా జోన్‌లవారీగా – 9789369634, 9361341926 తదితర నంబర్లను ప్రకటించారు. ఇదిలాఉండగా, గురువారం దిండుగల్ అయ్యలూరు, విరుదునగర్‌జిల్లా కారియా పట్టిలలో జరిగిన మేకల సంతలలో దీపావళినిమిత్తం రూ. 8 కోట్లకు విక్రయాలు జరిగాయి. దీపావళి మాముళ్ల పై ఆయా విభాగాలలోని సిబ్బంది దృష్టి పెట్టిన నేపథ్యంలో వీరి భరతం పట్టే విధంగా ఏసీబీ అధికారులు నిఘా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం అయ్యాయి. మదురై కార్పొరేషన్ జోనల్ కార్యాలయంలో రూ. 1.34 లక్షల సీజ్‌చేశారు. కేలంబాక్కం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగిన సోదాలలో రూ. 2 లక్షలు పట్టుబడింది.