
సహకార సంఘాలకు బోనస్
20 శాతం ప్రకటించిన ప్రభుత్వం
రోడ్డెక్కిన దీపావళి బస్సులు
ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అటాక్
రైల్వే స్టేషన్‌లలో నిఘా పెంపు
సాక్షి, చైన్నె : సహకార సంఘాల ఉద్యోగులకు 20 శాతం బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీపావళి ప్రత్యేక బస్సులు రోడ్డెక్కాయి. రైల్వే స్టేషన్లలో రద్దీ పెరగడంతో నిఘా పెంచారు. ఇక,దీపావళి మాముళ్లకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెట్టి సోదాలు ముమ్మరం చేశాయి. వివరాలు.. దీపావళిని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థలోని ఉద్యోగులకు గత వారం ప్రభుత్వం బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సహకార సంఘాలలో పనిచేస్తున్న ఉద్యోగులుకు వార్షిక బోనస్ , పరిహారం ప్రకటించారు. బోనస్ చట్టం ప్రకారం మిగులు నిధులు కలిగిన సంఘాలకు 20 శాతం బోనస్‌ను ప్రకటించారు. నికర లాభం ఆర్జించే సంఘాలలోని ఉద్యోగులకు 10 శాతం ప్రకటించారు. లాభా పేక్ష లేని సంఘాల పనిచేసే వారకి రూ. 3 వేల నుంచి రూ. 2400 వరకు అందించే విధంగా ఉత్తర్వులు గురువారం జారీ అయ్యాయి. మొత్తం 44,081 మంది ఉద్యోగులకు రూ. 44.11 కోట్లను కేటాయించారు.