
ఉరి వేసుకుని ఖైదీ మృతి
● జైళ్ల శాఖ డీఐజీ విచారణ
అన్నానగర్: తెన్‌కాసి జిల్లా కడయనల్లూరు సమీపంలోని కాశీధర్మం అమ్మన్ కోవిల్ వీధికి చెందిన మాడ సామి కుమారుడు వినోద్ కుమార్ (30) కూలి. ఇతనికి భార్య ముత్తులక్ష్మి, ఇద్దరు కుమారులు మధుసూధన్ (5), మహేష్ ఉన్నారు. ఈ స్థితిలో తెన్‌కాశి ఆల్ ఉమెన్ పోలీసులు 2019లో మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు వినోద్ కుమార్‌ను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తరువాత అ తన్ని పాలై మధ్య జైలుకు తరలించారు. తరువాత బె యిల్‌పై విడుదల చేశారు. అప్పటి నుంచి వినోద్ కు మార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, పోలీసులు అతన్ని తిరి గి అరెస్టు చేసి సెంట్రల్ జైలులో ఉంచారు. ఈ స్థితిలో బుధవారం జైలు ఆవరణలోని టాయిలెట్‌లో వినోద్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పెరుమాల్ పురమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సెల్వకుమార్ కేసు నమోదు చేసి, వినోద్ కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఎలా చనిపోయాడు? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇంతలో వినోద్ కుమార్ ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడని వెల్లడైంది. ఈ విషయంలో పోక్సో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా మధురై జైళ్ల డీఐజీ మురుగేశన్ అకస్మాత్తుగా పాలై సెంట్రల్ జైలుని పరిశీలించి విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
మున్సిపల్ కమిషనర్
బాధ్యతల స్వీకరణ
తిరుత్తణి: తిరుత్తణి మున్సిపల్ కమిషనర్‌గా కింగ్‌స్టన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుత్తణి మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. అతని స్థానంలో శంకరన్‌కోవిల్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన కింగ్‌స్టన్‌ను తిరుత్తణికి బదిలీ చేశారు. అతను బుధవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అతనికి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, వైస్ చైర్మన్ స్వామిరాజ్, వార్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.