
చాంపియన్లకు సత్కారం
కొరుక్కుపేట: చైన్నెలోని అమృత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ప్రతిష్టాత్మక సౌత్ ఇండియా కలనరీ అసోసియేషన్ కాంపిటీషన్ (సికా–2025)లో 26 బంగారు పతకాల అద్భుతమైన విజయాన్ని జరుపుకుంటూ సికా గోల్డ్ గాలా 2025ను ఘనంగా నిర్వహించింది. చైన్నె, బెంగళూరు, విజయవాడ , హైదరాబాద్ క్యాంపస్‌ల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులు వెన్న చెక్కడం, పేస్ట్రీ ఆర్ట్, మాక్‌టెయిల్ తయారీ, ఆహార ఉత్పత్తిలో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను ప్రదర్శించారు. 3,200 మంది పాల్గొన్న వారిలో చైన్నె అమృత విద్యార్థులు ప్రత్యేకంగా నిలిచారు. రాష్ట్ర మంత్రి టి. మనోతంగరాజ్ బంగారు పతక విజేత జినిలిన్ జె అలెన్‌ను సత్కరించారు. మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో చైన్నె అమృత ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ ఆర్.భూమినాథన్ విజేతలందరినీ అభినందించి 26 బంగారు పతకాల సాధించిన వారికి రూ.15.4 లక్షల నగదు పురస్కారాలతో గౌరవించారు.