
పూండి, పుళల్‌కు జలకళ
– కరకట్ట ప్రాంతాలకు అలర్ట్
తిరువళ్లూరు: చైన్నెకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌లైన పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్, పుళల్ రిజర్వాయర్‌లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో రిజర్వాయర్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు జలాలను దిగువకు విడుదల చేశారు. వివరాలు.. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌లలో పూండి సత్యమూర్తీ సాగర్ రిజర్వాయర్ ప్రధానమైనది. ఆంధ్ర కండలేరు రిజర్వాయర్ నుంచి విడుదలయ్యే కృష్ణాజలాలు, ఆంధ్ర, వేలూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని పూండిలో నిల్వ వుంచి అక్కడి నుంచి పుళల్, చెమరంబాక్కం, కన్నన్‌కోట–తేరువాయి కండ్రిగ, చోళవరం రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. సంబందిత రిజర్వాయర్‌ల నుంచి నీటి శుద్ధీకరణ కేంద్రానికి నీటిని తరలించి అక్కడ నీటిని శుధ్దీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. పూండిలో 3.33 టీఎంసీలు, పుళల్‌లో మూడు, కన్నన్‌కోట తేరువాయి కండ్రిగ రిజర్వాయర్‌లో 0.50 టిఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. పూండి రిజర్వాయర్ మొత్తం ఎత్తు 35 అడుగులు. ఇటీవల కండలేరు నుంచి వచ్చిన నీటితోపాటూ వేలూరు ఆంధ్ర నుంచి వచ్చిన వరదనీటితో పూండి రిజర్వాయర్ నీటి మట్టం 23 అడుగుల నుంచి 35 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌కు సెకనుకు 2600 క్యూసెక్‌ల నీరు చేరుతూవుంది.
అదనపు జలాల విడుదల
ఈక్రమంలోనే పూండి రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిస్థాయికి చేరిన క్రమంలో రిజర్వాయర్ భద్రతను దృష్టిలో వుంచుకుని నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే పూండి రిజర్వాయర్‌లో 7వ, 10వ షట్టర్‌ల ద్వారా సెకనుకు 700 క్యూసెక్‌ల నీటిని బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ నీరు తామరపాక్కం అనకట్టకు చేరి అక్కడి నుంచి చోళవరం రిజర్వాయర్‌కు తరలించనున్నారు. కాగా పూండి రిజర్వాయర్ నుంచి మిగులు జలాలను కిందుకు విడుదల చేసిన నేపథ్యంలో కుశస్థలిలో వరదపోటు ఏర్పడింది. దీంతో కరకట్ట ప్రాంతాల్లోని కన్నపాళ్యం, వన్నిపాక్కం, మడియూర్, సీమావరం, వెళ్ళివాయల్‌చావడి, నాపాళ్యం, మణలి, పుదునగర్, సడయన్‌కుప్పం, ఎన్నూర్, పుదుకుప్పం, ఒదపై, నైవేలీ, రాజపాళ్యంతో సహా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక చైన్నెకు సమీపంలోని పుళల్ రిజర్వాయర్ సైతం పూర్తీ స్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో రిజర్వాయర్ నుంచి రెడు షట్టర్‌ల ద్వారా సెకనుకు 200 క్యూసెక్‌ల నీటిని దిగువకు విడుదల చేశారు.
పుళల్ రిజర్వాయర్ నుంచి విడుదలైన నీరు