
దర్యాప్తులో కీలక మలుపు
న్యూస్‌రీల్
కరూర్ ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశాలు
పర్యవేక్షణకు జస్టిస్ అజయ్ నేతృత్వంలో కమిటీ
అవి మధ్యంతర ఉత్తర్వులే అన్న న్యాయవాది విల్సన్
దేదీప్యమానం.. అన్నామలైయార్ ఆలయం
ఆకస్మికంగా ఢిల్లీకి గవర్నర్ ఆర్‌ఎన్ రవి
కొరుక్కుపేట: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి సోమవారం చైన్నె విమానాశ్రయం నుండి ఎయిరిండియా ప్యాసింజర్ విమానంలో ఒకరోజు పర్యటన కోసం న్యూఢిల్లీకి ఆకస్మికంగా బయల్దేరారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన అని, ఇందులో ముఖ్యమైనది ఏమీ లేదని చెబుతున్నారు. గవర్నర్ ఆర్.ఎన్ రవి ఉదయం 8.05 గంటలకు ఎయిరిండియా ప్యాసింజర్ విమానంలో చైన్నె విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌లో ఒక రోజు పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు ఆయన కార్యదర్శి, సహాయకుడు, భద్రతా అధికారి కూడా ఉన్నారు. ఇది గవర్నర్ ఢిల్లీకి ఆకస్మిక పర్యటన అని చెబుతున్నారు. రాత్రి 10.30 గంటలకు గవర్నర్ ఆర్.ఎన్.రవి న్యూఢిల్లీ నుండి ఎయిరిండియా విమానంలో తిరిగి వస్తారు. గవర్నర్ ఆకస్మిక ఢిల్లీ పర్యటనపై ఇంకా అధికారిక సమాచారం విడుదల కాలేదు. అయితే ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్తున్నారని, అందులో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదని సమాచారం.
ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య
అన్నానగర్: నైల్లె జిల్లాలోని గంగైకొండన్ సమీపం పరుత్తికులం అప్పర్ స్ట్రీట్ నివాసి ముత్తయ్య (38). ఇతని భార్య ముత్తులక్ష్మి (27). వీరు 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ముత్తమిళ్ (4), సుశీలాదేవి (3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ముత్తయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను తరచుగా తాగి వచ్చి భార్యతో గొడవ పడుతున్నాడని తెలుస్తుంది. దీని వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆదివారం ఉదయం ముత్తయ్య కూర చెయ్యమాని చికెన్ కొని ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తుంది. కానీ ముత్తులక్ష్మి తను చేయనని చెప్పి నిరాకరించింది. దీని తరువాత, ముత్తయ్య తన భార్య ముత్తులక్ష్మి, పిల్లలను గంగైకొండ నుంచి పరుత్తికులంలోని ముత్తులక్ష్మి తల్లి లక్ష్మమ్మ ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత ఆదివారం రాత్రి ముత్తయ్య మద్యం సేవించి పరుత్తికులానికి వెళ్లి భార్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఈ స్థితిలో సోమవారం ఉదయం, ముత్తులక్ష్మి తన పిల్లలను తీసుకొని పెరుమాళ్ ఆలయ అడవికి వెళ్లిది. చాలా సేపటి తర్వాత కూడా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో షాక్ కు గురైన ఆమె తల్లి లక్ష్మి, ఆమె కోసం వెతికింది. ఆ ప్రాంతంలోని ఓ బావి దగ్గర ముత్తు లక్ష్మి చెప్పులు పడి ఉండడంతో అక్కడి వెళ్లి పరిశీలించగా ముత్తు లక్ష్మి, పిల్లల మృతదేహాలు నీటిపై తేలుతున్నారు. గంగైకొండన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ బర్నబాస్ సోలమన్ నేతృత్వంలో సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు
సాక్షి, చైన్నె: గత నెల 27వ తేదీన కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ కేసును మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం విచారణ చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ టీవీకేతో పాటూ బాధితులగా పేర్కొంటూ కొందరు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ విచారణ గత వారం ముగిసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇవి మధ్యంతర ఉత్తర్వులే..
సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులు అని డీఎంకే ఎంపీ, ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాదులలో ఒకరైన విల్సన్ తెలిపారు. పిటిషన్‌ల దాఖలులో మోస పూరితం నిరూపితమైన పక్షంలో తాజా ఉత్తర్వులు రద్దు అయినట్టే అని వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట కేసులో తుది ఉత్తర్వు ఏమిటో వేచి చూడాలన్నారు. పిటిషనర్లుగా పేర్కొంటున్న వ్యక్తులు తమకు సంబంధం లేదంటూ ఫిర్యాదులు చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లామని, తదుపరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతానికి కేసును సీబీఐకు బదిలీ చేయాలని ఆదేశించిందన్నారు. హైకోర్టు విచారణలో తమిళనాడు ప్రభుత్వ జోక్యం లేదని, నోటికి వచ్చిందని ఆదవ్ అర్జున వాగుతున్నారన్నారు.తమిళనాడు ప్రభుత్వం నియమించిన జస్టిస్ అరుణా జగదీశన్ కమిషన్ విచారణ కొనసాగుతుందని, ఇందులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదన్నారు.
సోమవారం న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. మధురై ధ్విసభ్య బెంచ్ ధర్మాసనం అధికార పరిధిలో ఈ కేసు ఉంటే, ఇందులో మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ జోక్యం ఏమిటో అని ప్రశ్నలు సందించారు. ప్రభుత్వం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు మద్రాస్ హైకోర్టు ఏకపక్ష ఉత్తర్వులు ఎలా జారీ చేయగలదన్న ప్రశ్నలు వేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు, వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తంచేస్తూ అక్షింతలు వేశారు. ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలకలం రేపిందని గుర్తుచేస్తూ, ఈ వ్యవహారంలో నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఆదేశించారు. అలాగే ఈ విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క మిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారని, ఇందులో ఇద్దరు తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులుగా ఉంటారని, అయితే, వీరు తమిళనాడుకు చెందిన వారుగా మాత్రం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కమిటీకి సీబీఐ దర్యాప్తును పూర్తిగా పర్యవేక్షించే అధికారం ఉంటుందని ప్రకటించారు. ఆధారాలను, సాక్ష్యాలను సమీక్షించడం, తగిన సూచనలు ఇవ్వడం వంటి అధికారులు కూడా ఈ కమిటీకి ఉంటాయని వివరించారు. కాగా, తీర్పు సమయంలో పిటిషనర్లకు పేర్కొంటున్న వ్యక్తులకు సంబంధం లేకుండా సిబీఐ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి,అవసరం అయితే, సీబీఐ విచారణకు ఆదేశిద్దామంటూ న్యాయమూర్తులు సూచించారు.
నిష్పాక్షిక విచారణకు..
నేటి నుంచి సభాపర్వం
టీవీకేను తొక్కే ప్రయత్నం..
టీవీకే ప్రచార వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున మీడియాతో మాట్లాడుతూ, టీవీకేను అడ్రస్ లేకుండా తొక్కేయాలన్న ప్రయత్నం కరూర్‌లో జరిగిందని ఆరోపించారు. సరిహద్దులలో కరూర్ పోలీసులు విజయ్‌కు ఆహ్వానం పలకడం అనుమానాలకు బలాన్ని చేకూర్చిందన్నారు. ఇతర జిల్లాలలో ఎక్కడా జరగని ఘటన ఒక్క కరూర్‌లోనే జరగడం అనేక ప్రశ్నలకు దారి తీసిందన్నారు. ఘటన జరిగిన సమాచారంతో తాము కరూర్ సరిహద్దులలోనే వేచి ఉన్నామని, అయితే పోలీసులు అల్లర్లు బయలు దేరుతాయని పేర్కొంటూ, పంపించేశారని ఆరోపించారు. ఈ ఘటనలో మరణించిన 41 మంది కుటుంబాలను విజయ్ దత్తతకు తీసుకునేందుకు నిర్ణయించారని ప్రకటించారు. కాగా, ఈతీర్పును బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆహ్వానించగా, బాధితులకు ఒరిగేది శూన్యమే అని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వ్యాఖ్యానించారు.
టీవీకే నేత విజయ్ ప్రచారం సందర్భంగా చోటు చేసుకున్న పెను విషాద ఘటన కేసు సీబీఐ కోర్టులోకి చేరింది. ఈ కేసును సీబీఐ విచారణ చేస్తుందని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. దర్యాప్తు సరైన మార్గంలో సాగే దిశగా పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలో కమిటీని నియమించారు.

దర్యాప్తులో కీలక మలుపు

దర్యాప్తులో కీలక మలుపు

దర్యాప్తులో కీలక మలుపు