కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం

Oct 14 2025 7:45 AM | Updated on Oct 14 2025 7:47 AM

● శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి

సాక్షి, చైన్నె: హిందూ మత ధార్మిక శాఖ నేతృత్వంలో కొత్త ప్రాజెక్టులకు ఆలయాలలో సీఎం స్టాలిన్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాలు జరిగాయి. కోయంబత్తూర్‌ జిల్లా మరుదమలై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో రూ. 33.63 కోట్లతో, వేలూరు జిల్లా మార్గబంధీశ్వర ఆలయంలో రూ. 4.38 కోట్లతో , నామక్కల్‌ జిల్లా, కున్నామలైలోని వల్లీశ్వర ఆలయంలో రూ. 3.69 కోట్లతో భక్తుల సౌకర్యార్థం వివిధ పనులతో పాటుగా పెరంబలూరులో అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయ నిర్మాణాలు శంకుస్థాపన చేసిన వాటిలో ఉన్నాయి. తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామి ఆలయంలో రూ. 15.67 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ నిర్మాణాలు, ఈరోడ్‌ జిల్లా సెన్నిమలైలలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో రూ. 8.27కోట్లతో పనునరుద్ధరించిన పనులు, తిరువణ్ణామలై అరుణాచలేశ్వరర్‌ ఆలయంలో రూ. 10.47 కోట్లతో పూర్తి చేసిన విమాన ప్రాకారం విద్యుత్‌ మయం, దిండిగల్‌ జిల్లా పళణి దండాయుధ పాణి ఆలయంలో రూ. 3.52 కోట్లతోనిర్మించిన భవనాలను సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అలాగే తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ హిందూ ధర్మాదాయ శాఖఛారిటీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు ఎంపికై న 12 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే, జూనియర్‌ ఇండస్ట్రియల్‌ ఆఫీసర్‌ పదవికి ఎంపికై న 29 మందితో పాటూ మరికొన్ని పోస్టులకు ఎంపికై న మొత్తం 83 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్‌. మురుగానందం తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిప్‌కాట్‌ పారిశ్రామిక పార్కులలో 16 పిల్లల సంరక్షణ కేంద్రాలు, రూ. 120 కోట్ల వ్యయంతో దిండివనంలో మెగా ఫుడ్‌పార్క్‌, రూ. 70 కోట్ల వ్యయంతో తేని మెగా ఫుడ్‌ పార్క్‌లను సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీఆర్‌బీ రాజ తదితరులు హాజరయ్యారు. న్యాయ శాఖ తరపున రూ. 55.68 కోట్ల వ్యయంతో మధురై ప్రభుత్వ న్యాయ కళాశాలకు కొత్త విద్యా, పరిపాలన భవనం, వేలూరు ప్రభుత్వ న్యాయ కళాశాల కొత్త లైబ్రరీ భవనాన్ని సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దురై మురుగన్‌ తదితరులు హాజరయ్యారు. పర్యాటక శాఖనేతృత్వంలో తిరువణ్ణామలై జిల్లా జవధుమలై, కరూర్‌ జిల్లా పొన్ననియూర్‌ ఆనకట్ట నమక్కల్‌ జిల్లా కొల్లిమలై ప్రదేశాలలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ. 7.46 కోట్లతో పూర్తిచేసిన, రూ. 16.30 కోట్లతో చేపట్టనున్న పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆర్‌. రాజేంద్రన్‌ తదితరులు హాజరయ్యారు. ట్రాన్స్‌జెండర్ల జీవనోపాధి మెరుగుదల కోసం చైన్నె, మధురైలలో రూ. 43.88 లక్షల వ్యయంతో అరన్‌ ట్రాన్స్‌జెండర్‌ హోమ్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గీతా జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం 1
1/1

కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement