
రూ.2 కోట్లు లంచం కేసులో కేంద్ర ప్రభుత్వ అధికారి అరెస్టు
సాక్షి, చైన్నె : బాణసంచాలకు ఉపయోగించే పేలుడు పదార్థాల పరిశ్రమలు, విక్రయ దారుల నుంచి రూ. 2 కోట్లు లంచం పుచ్చుకున్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరిని సీబీఐ, అవినీతి నిరోధక విభాగం అధికారులు పథకం ప్రకారం సేలంలో అరెస్టు చేశారు. ఆయన్ని విచారిస్తున్నారు. వివరాలు..పేలుడు పదార్థాలకు అనుమతి వ్యవహారానికి సంబంధించిన విభాగంలో గణేష్ కీలక అధికారిగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఆయన గత రెండు రోజులుగా సేలంలోని ఓ హోటల్‌లో బస చేసి ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన బయటకు వెళ్లి రావడం జరుగుతూ వచ్చింది. ఈ వ్యవహారం సీబీఐ, అవినీతి నిరోధక విభాగం అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆదివారం అర్థరాత్రి వేళ ఆయన బస చేసిన హోటల్ గదిలో సోదాలు చేశారు. ఇక్కడ రూ. 2 కోట్లు పట్టుబడట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆయన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా దీపావళి మాముళ్ల వేటలో భాగంగా ఇక్కడి పరిశ్రమలు, విక్రయదారులను ఆయనకలుస్తూ వచ్చినట్టు, వారి నుంచి లంచంగా ఈ మొత్తం పుచ్చుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చెక్‌పోస్టులు పరిసరాలలో ఏసీబీ రంగంలోకి దిగింది. దీపావళి మాముళ్ల వేట సాగే అవకాశాలతో నిఽఘాతో వ్యవహరిస్తున్నారు. ఈ దృష్ట్యా, ఈసారి అవినీతి నిరోధక శాఖకు ఏఏ అధికారి చిక్కబోతున్నాడో వేచిచూడాల్సిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వ అధికారి చిక్కడం చర్చకు దారి తీసింది.
సదరన్ రైల్వేకు
కొత్త ఏజీఎం
కొరుక్కుపేట: సదరన్ రైల్వే కొత్త అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా1988 బ్యాచ్‌కి చెందిన విపిన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సదరన్ రైల్వే ప్రకటనలో పేర్కొంది. విపిన్ కుమార్ 1988లో ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్‌ఎస్ ఈ)లో చేరారు. తన సుదీర్ఘమైన కెరీర్‌లో, సౌత్ సెంట్రల్ రైల్వే, నార్తర్న్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే , నార్త్ సెంట్రల్ రైల్వే వంటి జోన్‌లలో వివిధ సాంకేతిక, నిర్వాహక పనులను నిర్వహించారు. రైల్వేలు, మెట్రోలు, హైవేలు సొరంగాలలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆయన నాయకత్వం వహించారు, బహుళ–క్రమశిక్షణా డొమైనన్‌లలో సామర్థ్యాన్ని ప్రదర్శించారు. విపిన్ కుమార్ దక్షిణ రైల్వే ఏజీఎంగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కన్స్‌ట్రక్షన్ పదవిలో ఉన్నారు. గతంలో, ఆయన తూర్పు రైల్వేలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎస్‌డీడీఎం), బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. అలహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడైన విపిన్ కుమార్, ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైనన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆగస్టు 2025లో పదవీ విరమణ చేసిన శ్రీ కౌశల్ కిషోర్ స్థానంలో విపిన్ కుమార్ నియమితులయ్యారని వెల్లడించింది.
ఫిట్‌నెస్‌తో
సంపూర్ణ ఆరోగ్యం
సాక్షి, చైన్నె: ఫిట్ నెస్‌తో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తోందని ఎమ్మెల్యే అరవింద్ రమేష్ అన్నారు. హై ఆన్ ఫిట్‌నెస్ స్టూడియో తన సరికొత్త శాఖను చైన్నె కరపాక్కంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు ఆరి అర్జునన్ , ఎమ్మెల్యే అరవింద్ రమేష్, ఐఎఫ్‌ఎఫ్ బి ప్రో డెల్టా దిలీప్ తో కలసి హై ఆన్ ఫిట్‌నెస్ స్టూడియో వ్యవస్థాపకుడు దీనదయాళన్ ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే అరవింద్ రమేష్ మాట్లాడుతూ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిందన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి ఫిట్‌నెస్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. నిర్వాహకులు దీనదయాళన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాల పరికరాలు, సర్టిఫైడ్ ట్రైనర్లు, ఫంక్షనల్ శిక్షణ – క్రిట్రైనర్ ఇండోర్ అండ్ అవుట్‌డోర్ బూట్ క్యాంపులు, ఎలివేటెడ్ కార్డియో విభాగం, ప్రత్యేకమైన స్పిన్నింగ్ – క్రాస్‌ఫిట్ స్టూడియోలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.