తిరువళ్లూరు: కాపు అటవీ ప్రాంతానికి సమీపంలోని పుల్లరంబాక్కం గ్రామంలో అరుదైన ఊసరవెల్లి కనిపించింది. తిరువళ్లూరు జిల్లా పూండిలో కాపు అటవీ ప్రాంతం, చైన్నెకు తాగునీటిని అందించే సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో జింకలు, నక్కలు, అరుదైన పాములు తరచూ సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం పుల్లరంబాక్కం గ్రామంలో అరుదైన ఊసరవెల్లి తారసపడింది. దీనిని స్థానికులు ఆసక్తిగా చూడడంతోపాటు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశారు. దాదాపు 20 నిమిషాలపాటు అటుఇటూ తిరిగిన ఊసరవెల్లి రంగులు మార్చుతూ సమీపంలోని దట్టమైన పొదల్లోకి వెళిపోయింది.