ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం

Oct 12 2025 7:01 AM | Updated on Oct 12 2025 7:01 AM

ఘనంగా

ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం

● అందుకున్న సినీ, నాటక, సంగీత రంగ ప్రముఖులు ● మద్దతుగా ఉంటానని సీఎం స్టాలిన్‌ వ్యాఖ్య

సినిమా, నాటకం, బుల్లితెర, సంగీతం వంటి కళారంగాల్లో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు మూడేళ్లకు గాను కలైమామణి అవార్డులను శనివారం ప్రదానం చేశారు. ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్‌ కలైమామణి అవార్డులతో పాటూ తమిళ మహాకవి భారతీయార్‌, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని ఎంఎస్‌ సుబ్బలక్ష్మి, నృత్యకారిణి బాల సరస్వతి పేరిట అవార్డులను అందజేశారు.

సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం తరపున తమిళనాడు ఇయల్‌ ఇసై నాటక మండ్రం ద్వారా వివిధ కేటగిరీల్లో కళా రంగంలో రాణించే వారికి ఏటా కలైమామణి అవార్డులను ప్రకటించడం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత మూడు సంవత్సరాలుగా ఈ అవార్డులు ప్రకటించ లేదు. ఎట్టకేలకు 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి కలైమామణి అవార్డులకు అర్హులైన వారి ఎంపిక చేసిన గత నెల ప్రకటించారు. అలాగే అలాగే, తమిళ మహాకవి భారతియార్‌, గాయని ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి, బాలసరస్వతిల పేరిట అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేశారు. సినిమా, నాటకం, సంగీతం, నృత్యం, బుల్లి తెర, గ్రామీణ కళలు, ఇతర కళలు అంటూ ఆయా విభాగాల వారిగా విభజించి అర్హులైన కళాకారులను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు.

అట్టహాసంగా..

భారతీయార్‌ అవార్డును డాక్టర్‌ ఎన్‌. మురుగేషన్‌ పాండియన్‌, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అవార్డును సంగీత గాయకుడు పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.జె. ఏసుదాస్‌, బాలసరస్వతి అవార్డును పద్మశ్రీ ముత్తు కన్నమ్మాళ్‌కు ప్రదానం చేశాను. కేజే ఏసుదాస్‌ తరపున ఆయన కుమారుడు విజయ్‌ ఏసు దాస్‌ ఈ అవార్డును అందుకోగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏసు దాస్‌ తన సందేశాన్ని ఇచ్చారు. 2021 సంవత్సరానికి సినిమా రంగానికి నటుడు ఎస్‌. జె. సూర్య , నటి సాయి పల్లవి, దర్శకుడు లింగుసామి తదితరులు సీఎం స్టాలిన్‌నుంచి అవార్డులను అందుకున్నారు. 2022 సంవత్సరానికి గాను సినిమా రంగానికి చెందిన నటుడు విక్రమ్‌ ప్రభు, నటి జయా వీసీ గుహనాథన్‌, గీత రచయిత వివేకా తదితరులు, 2023 సంవత్సరానిక గాను సినిమా రంగానికి నటుడు కె. మణికండన్‌, క్యారక్టర్‌ ఆర్టిస్టు జార్జ్‌ మరియాన్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌, నృత్య దర్శకుడు శాండీ అలియాస్‌ సంతోష్‌కుమార్‌, గాయని శ్వేతా మోహన్‌ తరపున ఆమె తల్లి సుజాత అవార్డును అందుకున్నారు. ఎంపికై న వారు, వారి తరపు వారు తరలి వచ్చిన సీఎం చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌, సమాచార మంత్రి స్వామి నాథన్‌, ఇయల్‌ ఇసై నాటక మండ్రం చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం స్టాలిన్‌ నుంచి అవార్డు అందుకుంటున్న ఎస్‌జె సూర్య, సాయి పల్లవి, విక్రమ్‌ ప్రభు

మద్దతుగా ఉంటా..

కలైమామణి అందుకున్న వారందరికి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం స్టాలిన్‌ ప్రసంగించారు. యువ కళాకారులను గుర్తించడం, వారికి మద్దతు ఇస్తూ రావడం జరుగుతున్నట్టు వివరించారు. కలైమామణి అవార్డు పొందిన కళాకారులకు బంగారు పతకాలు, అవార్డు సర్టిఫికేట్‌ అందజేశామన్నారు. ఈసందర్భంగా రాకెట్‌వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం కంటే విలువైనది కలైమామణి అని వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన కళలను, కళాకారులను ప్రోత్సహించడం, అంతరించిపోతున్న కళారూపాలకు జీవం పోయడం, సాంప్రదాయ కళలను ప్రపంచ దేశాలకు చాటడం వంటి కార్యక్రమాలను గురించి వివరిస్తూ, కళాకారులను ఆదుకునేందుకు అందిస్తున్న ప్రోత్సహక ఆర్థిక సాయం గురించిప్రస్తావించారు. ఈ మండ్రంకు ఇది వరకు ఇస్తున్న నిధులను రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లకు పెంచామన్నారు. కళాకారులకు మద్దతుగా ఎల్లప్పుడు ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం ఉంటుందన్నారు.

ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం1
1/3

ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం

ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం2
2/3

ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం

ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం3
3/3

ఘనంగా కలైమామణి అవార్డుల ప్రదానోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement